సీక్వెల్ చేయ‌నున్న న‌య‌న‌తార‌?

  • IndiaGlitz, [Thursday,April 05 2018]

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన త‌మిళ సినిమా ‘ఆరమ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో అనువదించారు. సామాజిక అంశం నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార కర్తవ్యమే తన విధిగా, ప్రజల క్షేమమే తన ధ్యేయంగా పనిచేసే కలెక్టర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో.. పసిపిల్లలు బోరుబావిలో పడిపోతే వారి కోసం నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాధికారులు తమ విధిని ఎలా నిర్వర్తిస్తారో దర్శకుడు గోపి నైనర్ కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఈ చిత్రం అటు తమిళంతో పాటు.. ఇటు తెలుగులో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు సమాచారం. మరో ఊరు, మరో సమస్య అన్నట్టుగా కథను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీక్వెల్‌లో కూడా నయనతార కలెక్టర్ పాత్రనే పోషించనుండగా.. నేడు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న కుల వ్యవస్థపై ఈసారి దర్శకుడు దృష్టి సారిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ సీక్వెల్ కూడా అనువాద రూపంలో తెలుగు నాట సంద‌డి చేయ‌నుంది.
 

More News

ఇంతలో ఎన్నెన్ని వింతలో అందరికి నచ్చే సినిమా - పూజా రామచంద్రన్

హరిహర చలన చిత్ర బ్యానర్‌పై నందు, సౌమ్య వేణుగోపాల్, పూజా రావుచంద్రన్, గగన్ విహారి తారాగణంగా రూపొందిన చిత్రం 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' ఏప్రిల్ 6న సినిమా విడుదలవుతుంది.

హ్యాట్రిక్ కొట్టిన సంస్థ‌లో అఖిల్ నాలుగో చిత్రం?

‘శ్రీమంతుడు’ (2015),‘జనతా గ్యారేజ్’ (2016), ‘రంగస్థలం’ (2018) చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌.

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ చిత్రంలో ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్స్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్నితెల‌యజేసే 'స‌త్య గ్యాంగ్‌' - సుమ‌న్‌

సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేశ్‌ ఖన్నా

'నా పేరు సూర్య' డైలాగ్ ఇంపాక్ట్

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య'