అతనితో నయనతార మూడోసారి?

  • IndiaGlitz, [Thursday,October 08 2015]

న‌య‌న‌తార హ‌వా త‌మిళ నాట మాములుగా లేదు. అందుకే ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా ఆమె ప‌క్క‌న న‌టించేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. న‌య‌న కూడా ఓ వైపు అప్ క‌మింగ్ హీరోల‌తోనూ, మ‌రో వైపు త‌ను ఇదివ‌ర‌కు ఆడిపాడిన స్టార్ హీరోల‌తోనూ క‌లిసి న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. 'త‌ని ఒరువ‌న్‌', 'మాయ' చిత్రాల విజ‌యాల‌తో మంచి స్వింగ్‌లో ఉన్న న‌య‌న జోరు చూసి.. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఆమె ప‌క్క‌న ముచ్చ‌ట‌గా మూడోసారి న‌టించేందుకు ఆశ‌ప‌డుతున్నాడ‌ట‌.

ఇదివ‌ర‌కు 'శివ‌కాశి' (తెలుగు 'విజ‌య‌ద‌శ‌మి'కి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌) కోసం ఐట‌మ్ సాంగ్‌లోనూ, 'విల్లు' కోసం క‌థానాయిక‌గానూ విజ‌య్ ప‌క్క‌న రెండుసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న న‌య‌న‌.. మూడోసారి అత‌ని ప‌క్క‌న న‌టించేందుకు దాదాపుగా ఓకే చెప్పింద‌న్న‌ది కోలీవుడ్ స‌మాచారం. ఈ చిత్రానికి ఎస్‌.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 'ఖుషి' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత విజ‌య్‌, ఎస్‌.జె.సూర్య కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డం.. అందునా కోలీవుడ్ క్వీన్ న‌య‌న‌తార నాయిక‌గా న‌టించే అవ‌కాశం ఉండ‌డంతో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారింది.

More News

అసిన్ పెళ్లి పై కామెంట్ చేసిన అనుష్క

టాలీవుడ్,కోలీవుడ్,బాలీవుడ్..టాప్ స్టార్స్ తో కలసి నటించిన అందాల భామ అసిన్. గజని సినిమాలో నటించిన అసిన్ ఆ..సినిమాలో ఎలాగైతే ఓ సెల్ ఫోన్ కంపెనీ ఓనర్ తో ప్రేమలో పడుతుందో...

బ్రూస్ లీ తమిళ్ ఆడియో రిలీజ్ వాయిదా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం బ్రూస్ లీ.

స్వీటీ..అదిరిందంటున్న జక్కన్న...

జక్నన్న అంటే దర్శకధీరుడు రాజమౌళి అని తెలుసు.మరి..స్వీటీ అంటే ఎవరనుకుంటున్నారా..

'డిక్టేటర్' కి అంజలి సెంటిమెంట్

రచ్చగెలిచి..ఇంట గెలిచిన కథానాయిక అంజలి.తొలుత తమిళ సినిమాల్లో తన ప్రతిభను చాటుకుని..ఆనక తెలుగు సినిమాల్లోనూ విజయబావుటా ఎగరవేసింది ఈ తెలుగమ్మాయి.

నిత్యామీనన్ పై అనుష్క కామెంట్..?

అలా..మొదలైంది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై..ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు...చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న హీరోయిన్ నిత్యా మీనన్.