అతనితో నయనతార మూడోసారి?
Send us your feedback to audioarticles@vaarta.com
నయనతార హవా తమిళ నాట మాములుగా లేదు. అందుకే ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా ఆమె పక్కన నటించేందుకు సిద్ధపడుతున్నారు. నయన కూడా ఓ వైపు అప్ కమింగ్ హీరోలతోనూ, మరో వైపు తను ఇదివరకు ఆడిపాడిన స్టార్ హీరోలతోనూ కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. 'తని ఒరువన్', 'మాయ' చిత్రాల విజయాలతో మంచి స్వింగ్‌లో ఉన్న నయన జోరు చూసి.. తమిళ స్టార్ హీరో విజయ్ ఆమె పక్కన ముచ్చటగా మూడోసారి నటించేందుకు ఆశపడుతున్నాడట.
ఇదివరకు 'శివకాశి' (తెలుగు 'విజయదశమి'కి ఒరిజనల్ వెర్షన్) కోసం ఐటమ్ సాంగ్‌లోనూ, 'విల్లు' కోసం కథానాయికగానూ విజయ్ పక్కన రెండుసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న నయన.. మూడోసారి అతని పక్కన నటించేందుకు దాదాపుగా ఓకే చెప్పిందన్నది కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రానికి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించనున్నారు. 'ఖుషి' వంటి ఘనవిజయం తరువాత విజయ్, ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం.. అందునా కోలీవుడ్ క్వీన్ నయనతార నాయికగా నటించే అవకాశం ఉండడంతో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments