బుల్లితెరపై
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు వినోదం అంటే సినిమానే. ఆ తర్వాత అనేక మాధ్యమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టెలివిజన్. సినిమా తారలకు ఒకప్పుడు టీవీలో నటించడం అంటే చిన్నచూపుగా ఉండేది. వారికి టీవీ ఆర్టిస్ట్‌గా ముద్ర పడిపోతుందన్న భయమే దానికి కారణం. ఇప్పుడంతా మారిపోయింది. సినిమా తారలు సైతం టీవీలో కనిపించడానికి, తద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
తమిళ తారల గురించి చెప్పుకోవాల్సి వస్తే కమలహాసన్, విశాల్, విజయ్‌సేతుపతి, వరలక్ష్మి వంటి ప్రముఖ తారలు టీవీ కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇప్పుడు వారి బాటలో నయునతార కూడా అడుగులు వేస్తోంది. అయితే చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉండే నయనతార టీవీ ప్రోగ్రామ్స్ ఎందుకు చెయ్యాలనుకుంటోంది అనేది ఎవరికీ అర్థం కాని విషయం. తాజా సమాచారం మేరకు ఒక ఛానల్ నిర్వహించే డాన్స్ కార్యక్రమానికి నయనతార అతిథిగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతివారం ఒక్కో అతిథితో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలా ఒక వారం నయనతార ఆ ప్రోగ్రామ్‌లో గెస్ట్ అప్పియురెన్స్ ఇవ్వబోతోంది. దీన్నిబట్టి టీవీ కార్యక్రమాలు కూడా సినిమా తారలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అర్థవువుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout