నయనతార కొత్త చిత్రం డోర

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ హారర్ చిత్రం తెరకెక్కుతోంది. దాసు రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ తెరకెక్కిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది.
నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

More News

జ్యోఅచ్యుతానంద యు.ఎస్ ప్రీమియర్ షోకు నారా రోహిత్..!

నారా రోహిత్-నాగ శౌర్య-రెజీనా కాంబినేషన్లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ జ్యోఅచ్యుతానంద.

ఓవర్ సీస్ లో చిరంజీవి సత్తా....

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా,ప్రెస్టిజియస్ 150 మూవీ 'ఖైదీ నంబర్ 150' సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

బాన్స్ వాడలో వరుణ్ తేజ్ ఫిదా..!

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఫిదా.

కొర‌టాల‌, మ‌హేష్ మెసేజ్ అదేనా...?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్సవం ప్లాప్ త‌ర్వాత ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.  ర‌కుల్ ప్రీత్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ కొత్త చిత్రం ప్రారంభం

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్‌ 8న సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది.