సిద్ధమ్మగా నయన తార లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం `సైరా నరసింహా రెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రమిది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తొలి యోధుడు ఓ తెలుగువాడు.. ఆయనే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. ఆయన జీవిత చరిత్రనే `సైరా నరసింహారెడ్డి`గా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది.
ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార చిరంజీవి భార్య సిద్ధమ్మ పాత్రలో కనపడబోతున్నారు. నేడు నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్‌ను సైరా టీమ్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రంలో గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ లుక్.. అవుకురాజు పాత్రలో కిచ్చా సుదీప్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments