మార్చి 16న నయనతార 'కర్తవ్యం' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది అన్ని భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ లతో విజయాల్ని సాధిస్తున్న నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts ) పతాకం పై తమిళం లో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ గా నిలిచినా ఆరమ్ (Araam) చిత్రాన్ని తెలుగు లో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు.
ఇది ఒక పొలిటికల్ డ్రామా చిత్రం. నయనతార ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పాత్రలో లీనమై నటించారు. తెలుగు లో ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మార్చి 16న విడుదల చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా ఈ చిత్రం యెక్క మెదటి లుక్ టీజర్ ని విడుదల చేసారు.
తమిళం లో విడుదలైన ఈ చిత్రం నయనతార కు లేడి సూపర్‌స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులకి తాను ఎప్పటికి రుణపడి ఉంటాను అని తాను తెలియచేసారు. తాను మరిన్ని మంచి చిత్రాలు చేస్తాను అని తెలియచేసారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ "తమిళం లో ఆరమ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నయనతార కెరీర్ లోనే పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం మాకు ఉంది. తెలుగు లో అన్ని కార్యక్రమాలు పూర్తచేసి మార్చి 16 న విడుదల చేస్తున్నాము.
నిత్యం మనం న్యూస్ ఛానల్ లో చూస్తున్న బోరు భావిలో ఆడుకుంటున్న పిల్లలు పడిపోతే, అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కథా వస్తువుగా తీసుకుని రియలిస్టిక్ గా బాగా దగ్గరగా ప్రతి ఓక్కరి హ్రుదయం తడిసేలా అద్బుతమైన నేరేషన్ తో దర్శకుడు గోపి నైనర్ తెరకెక్కించాడు. ఆ ఆపరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ పాత్రలో నయనతార నటవిశ్వరూపానికి ప్రేక్షకులు జైజైలు కొట్టారు.
ఈ చిత్రం తమిళం లో సూపర్‌హిట్ కావటమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ చూద్దామా అనే ఆశక్తికి నెలకొల్పింది. ఈ చిత్రాన్ని మార్చి 16 న తెలుగు ప్రేక్షకులకి దగ్గరకి తీసుకువస్తున్నాం. మహిళా దినోత్సవం సంధర్బంగా ఈచిత్రం మెదటి లుక్ టీజర్ ని విడుదల చేశాము. అన్ని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments