క‌మల్ చిత్రంలో న‌య‌న‌తార‌

  • IndiaGlitz, [Tuesday,January 30 2018]

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌నుంది. ఆ సినిమాయే 'ఇండియ‌న్ 2'. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయి.

అందులో భాగంగా హీరోయిన్‌గా న‌య‌న‌తార పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చింది. అంతా ఓకే అయితే క‌మ‌ల్‌, న‌య‌న‌తార క‌లిసి న‌టించే చిత్ర‌మిదే అవుతుంది.

ప్ర‌స్తుతం '2.0' పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో బిజీగా ఉన్న శంక‌ర్ జూన్‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 1996లో 'ఇండియ‌న్‌' సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మిస్తుంది.