బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నయనతార
- IndiaGlitz, [Saturday,March 02 2019]
నయనతార ఇప్పుడు కేవలం ఓ హీరోయిన్ మాత్రమే కాదు. లేడీ సూపర్‌స్టార్. కేవలం ఆమె పాత్రల కోసం థియేటర్లకు జనం క్యూ కడుతున్నారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నయనతార ఇటీవల ఓ ప్రయోగం చేశారట. అదీ 'ఐరా' సినిమా కోసం. 'ఐరా'లో నయనతార డ్యూయల్ రోల్ చేస్తున్నారు.
దానిలో భవాని, యమున అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు నయన్. యమున కేరక్టర్ చూడ్డానికి పోష్‌గా ఉంటుంది. భవాని పాత్ర జిడ్డుగా ఉంటుంది. దానికి తోడు నయన్ నల్లగా కనిపించేది ఈ పాత్రలోనే. 'మీరు ఇందులో నలుపుగా ఉంటారు' అని దర్శకుడు సర్జున్ చెప్పగానే నయన్ కేరక్టర్‌ను అంగీకరించలేదట. మూడు గంటలు స్పెండ్ చేసి, మేకప్ వేసుకుని తనకు ఓకే అనిపించాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
సో నయన్ నల్లగా కనిపించే భవాని పాత్ర సినిమాలో 25 నిమిషాలు ఉంటుందట. ఆ 25 నిమిషాలు నయనతార పోర్షన్ బ్లాక్ అండ్ వైట్‌లో సాగుతుందట. సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చాయి. ఆ తర్వాత కూడా అడపాదడపా కొన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించేవి. కానీ పూర్తి కమర్షియల్ చిత్రంలో 25 నిమిషాల చిత్రం బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటే బావుంటుందని చిత్ర టీమ్‌కు నయన్ తార ఇచ్చిన ఐడియాను వాళ్లు వర్కవుట్ చేశారట. ఆ పోర్షన్ చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.