బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నయనతార
Send us your feedback to audioarticles@vaarta.com
నయనతార ఇప్పుడు కేవలం ఓ హీరోయిన్ మాత్రమే కాదు. లేడీ సూపర్‌స్టార్. కేవలం ఆమె పాత్రల కోసం థియేటర్లకు జనం క్యూ కడుతున్నారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నయనతార ఇటీవల ఓ ప్రయోగం చేశారట. అదీ `ఐరా` సినిమా కోసం. `ఐరా`లో నయనతార డ్యూయల్ రోల్ చేస్తున్నారు.
దానిలో భవాని, యమున అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు నయన్. యమున కేరక్టర్ చూడ్డానికి పోష్‌గా ఉంటుంది. భవాని పాత్ర జిడ్డుగా ఉంటుంది. దానికి తోడు నయన్ నల్లగా కనిపించేది ఈ పాత్రలోనే. 'మీరు ఇందులో నలుపుగా ఉంటారు` అని దర్శకుడు సర్జున్ చెప్పగానే నయన్ కేరక్టర్‌ను అంగీకరించలేదట. మూడు గంటలు స్పెండ్ చేసి, మేకప్ వేసుకుని తనకు ఓకే అనిపించాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
సో నయన్ నల్లగా కనిపించే భవాని పాత్ర సినిమాలో 25 నిమిషాలు ఉంటుందట. ఆ 25 నిమిషాలు నయనతార పోర్షన్ బ్లాక్ అండ్ వైట్‌లో సాగుతుందట. సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చాయి. ఆ తర్వాత కూడా అడపాదడపా కొన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించేవి. కానీ పూర్తి కమర్షియల్ చిత్రంలో 25 నిమిషాల చిత్రం బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటే బావుంటుందని చిత్ర టీమ్‌కు నయన్ తార ఇచ్చిన ఐడియాను వాళ్లు వర్కవుట్ చేశారట. ఆ పోర్షన్ చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout