ప్రతినాయకిగా
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల తార నయనతార ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో మెప్పించనున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'దర్బార్'. ఈ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో నయనతార నటించనుందనే సంగతి తెలిసిందే.
అయితే ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ సినిమాలో రజనీకాంత్, నయనతార జంటగా నటించడం లేదట. నయనతార ప్రతి నాయకి పాత్రలో నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే సినిమా ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
అలాగే బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ కూడా ఇందులో విలన్‌గా నటిస్తున్నాడట. ఈ చిత్రాన్ని మురుగదాస్.. తండ్రి, కూతురు మధ్య అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com