Connect: నయనతార హారర్ థ్రిల్లర్ 'కనెక్ట్' ఈ నెల 22న రిలీజ్

  • IndiaGlitz, [Monday,December 05 2022]

నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ కనెక్ట్ సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు.

హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన మయూరి సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన గేమ్ ఓవర్ కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్‌ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.

అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - పృథ్వి చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ - మణికంఠన్ కృష్ణమాచారి, ఎడిటింగ్ - రిచర్డ్ కెవిన్, పీఆర్వో - జీఎస్కే మీడియా.

More News

'రుద్రంగి' చిత్రంలో ఆశిష్ గాంధీ మల్లేశ్ పాత్రలో ఫస్ట్ లుక్ విడుదల

ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో  భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'.

'సెల్ఫీష్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం!

రౌడీబాయ్స్ చిత్రంలో హీరోగా అందరి హృదయాలను కొల్లగొట్టిన కథానాయకుడు ఆశిష్ నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫీష్.

Anand Ravi: ‘కొరమీను’ సినిమా చూసి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు - ఆనంద్ ర‌వి

ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్

World Soil Day: హైదరాబాద్ లో వివిధ లొకేషన్లలో మట్టిని రక్షించు అవగాహన కార్యక్రమం

వందల మంది మట్టిని రక్షించు ఉద్యమం వాలంటీర్లు ఇంకా కాలేజీ విద్యార్థులు శిల్పారామం, కూకట్ పల్లి, ట్యాంక్ బండ్, అమీర్ పేట్, ప్యారడైజ్, కొత్తపేట్, తార్నాక

Aha Naa Pellanta: 75 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన ‘అహ నా పెళ్ళంట’

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తున్న వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 నుంచి రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఒరిజిన‌ల్ ‘అహ నా పెళ్లంట’.