నయనతార పాత్ర పేరేమిటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
సింహా, శ్రీరామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్లో వస్తున్న సినిమా జై సింహా. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. నయనతారతో పాటు హరిప్రియ, నటాషా దోషి కూడా ఇందులో కథానాయికలుగా నటిస్తున్నప్పటికీ.. సినిమా కథ అంతా నయనతార పాత్ర చుట్టూ తిరుగుతుందని టాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి.
కాగా, ఈ సినిమాలో నయనతార పోషించే పాత్ర పేరు మనోజ్ఞ అని.. ఆ పాత్రకు తగ్గట్టే ఆ పాత్ర డిజైనింగ్ కూడా చాలా బాగా ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. బాలకృష్ణ చిత్రాల్లో నటించిన రెండు సందర్భాల్లోనూ నయనతారకి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం విషయంలోనూ అది కొనసాగుతుందని వారు చెప్పుకొస్తున్నారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com