నయనతార నమ్మిందట
Send us your feedback to audioarticles@vaarta.com
నయనతార ప్రధాన పాత్రలో సి.కె. ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి., శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకాలపై అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు నిర్మించిన మయూరి చిత్రం ఇటీవల విడుదలై భారి ఓపెనింగ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ప్రభు, ప్రకాష్ కు థాంక్స్. నేను నిర్మించిన చందమామ సినిమాకు చాలా మంది కాల్స్ చేసి సినిమా బావుందని చెప్పారు. ఆ తరువాత నేను చాలా చిత్రాలను నిర్మించాను. కాని ఈ సినిమాకు వచ్చిన అప్లాజ్ మరే సినిమాకు రాలేదు. తమిళంలో మాయ అనే టైటిల్ తో రిలీజ్ అయితే తెలుగులో మాత్రం సెన్సేషనల్ హిట్ అయిన మయూరి సినిమా టైటిల్ తో రిలీజ్ చేసాం. థియేటర్స్ లో మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ పర్ఫెక్ట్ సినిమా చేసారు. దర్శకుడికి, కెమెరామెన్ కు, మ్యూజిక్ డైరెక్టర్ కు సింక్ అయితే ఎలా ఉంటుందో అదే మయూరి చిత్రం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.
తమిళ నిర్మాత ప్రభు మాట్లాడుతూ.. తెలుగులో గతంలో శకుని సినిమా చేసాం. కాని మా సొంత బ్యానర్ లో వచ్చిన మొదటి చిత్రమిది. అశ్విన్ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. కొత్త కాన్సెప్ట్. తను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ దగ్గర పని చేయలేదు. స్క్రిప్ట్ ఎలా నేరేట్ చేసాడే అంతకంటే బాగా ప్రెజెంట్ చేసాడు. కంటెంట్ ను నమ్మి నయనతార ఈ సినిమాలో నటించారు. రిలీజ్ చేయడానికి కాస్త సమయం పట్టినా కళ్యాణ్ గారు చాలా ఓపికగా వెయిట్ చేసారు.. అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ రాన్ యోహన్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మ్యూజిక్ చేయడం చాలెంజింగ్ వర్క్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న సినిమా. టీం ఎఫర్ట్ తో ఈ మూవీ చేసాం. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.
హీరో ఆరి మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. మొదట నాని గారికి ఈ కథ చెప్పారు. కాని ఆయన ఈ పాత్ర కొత్త వారికైతే బావుంటుందని చెప్పారు. ఆయన వలనే నాకు ఈ ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాకు హీరో స్క్రీన్ ప్లే. అనుకున్నదాని కంటే పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్.. అని చెప్పారు.
దర్శకుడు అశ్విన్ శరవణన్ మాట్లాడుతూ.. ఓ మంచి సినిమా చేయాలని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నయనతార ఈ చిత్రాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించారు. కమర్షియల్ సినిమా కాకపోయినా బిడ్డ తల్లిగా స్క్రిప్ట్ ను నమ్మి ఈ సినిమాకు పని చేసారు. కథ నేరేట్ చేసిన వెంటనే ఆమె నటించడానికి ఓకే చెప్పారు. ఆరి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అని ఆలోచించకుండా మా మీద నమ్మకంతో సినిమా చేసాడు. ప్రతి టెక్నీషియన్ తమ సొంత సినిమాకు పని చేసినట్లుగా కష్టపడ్డారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఇంత బాగా ప్రమోట్ చేసిన కళ్యాన్ గారికి, ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout