మృణాళినిగా నయన్
Send us your feedback to audioarticles@vaarta.com
కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది నయనతార. తమిళంలో ఈ ముద్దుగుమ్మకి ఉన్న క్రేజే వేరు. రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది ఈ కేరళకుట్టి. ఓ వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు హీరో సెంట్రిక్ మూవీస్‌లో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రాలలో వేలైక్కారన్ ఒకటి.
ధ్రువ ఒరిజనల్ వెర్షన్ తని ఒరువన్ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రెమో ఫేం శివకార్తీకేయన్ కథానాయకుడు.
వేలైక్కారన్‌లో నయనతార పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని.. మృణాళిని పాత్రలో ఆమె నటన గుర్తుండిపోతుందని దర్శకుడు మోహన్ రాజా చెప్పుకొస్తున్నాడు. ఇటీవల కాలంలో నయన్ చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా రానున్న ఈ సినిమా తెలుగులోనూ అనువాదం కానుంది. ప్రస్తుతం నయనతార.. చిరంజీవి సైరా నరసింహా రెడ్డి, బాలకృష్ణ 102వ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments