మృణాళినిగా నయన్

  • IndiaGlitz, [Monday,September 11 2017]

కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌లు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది న‌య‌న‌తార‌. త‌మిళంలో ఈ ముద్దుగుమ్మ‌కి ఉన్న క్రేజే వేరు. రూ.3 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటోంది ఈ కేర‌ళ‌కుట్టి. ఓ వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మ‌రో వైపు హీరో సెంట్రిక్ మూవీస్‌లో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ న‌టిస్తున్న చిత్రాల‌లో వేలైక్కార‌న్ ఒక‌టి.
ధ్రువ ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ త‌ని ఒరువ‌న్ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో రెమో ఫేం శివ‌కార్తీకేయ‌న్ క‌థానాయ‌కుడు.

వేలైక్కార‌న్‌లో న‌య‌న‌తార పాత్ర ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని.. మృణాళిని పాత్ర‌లో ఆమె న‌ట‌న గుర్తుండిపోతుందని ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా చెప్పుకొస్తున్నాడు. ఇటీవ‌ల కాలంలో న‌య‌న్ చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా ఈ సినిమా ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నాడు. డిసెంబ‌ర్ 22న క్రిస్మ‌స్ కానుక‌గా రానున్న ఈ సినిమా తెలుగులోనూ అనువాదం కానుంది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార‌.. చిరంజీవి సైరా న‌ర‌సింహా రెడ్డి, బాల‌కృష్ణ 102వ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

More News

రెండో పాట‌తోనూ అల‌రించిన థ‌మ‌న్‌

యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. నాగార్జున రాజుగారి గ‌ది 2, శ‌ర్వానంద్ మ‌హానుభావుడు, విక్ర‌మ్ స్కెచ్‌, అనుష్క భాగ్‌మ‌తి, సాయిధ‌ర‌మ్ తేజ్ జ‌వాన్ చిత్రాలు ఆయ‌న ఖాతాలోనే ఉన్నాయి. వీటిలో ముందుగా మ‌హానుభావుడు చిత్రం తెర‌పైకి రానుంది. 

రీమేక్‌లో నిఖిల్ హీరోయిన్స్‌

గ‌తేడాది న‌వంబ‌ర్‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన చిత్రం ఎక్క‌డికి పోతావ్ చిన్న‌వాడా. నిఖిల్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో హెబ్బా ప‌టేల్‌, నందితా శ్వేత‌, అవికా గోర్ హీరోయిన్స్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' విడుదల వాయిదా!!

పెద్ద చిత్రాలతో పోటీ పడి ప్రచారం నిర్వహిస్తూ..

మూడోసారి కూడా మల్టీస్టార‌రే...

నాగార్జున‌,నాని కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తాడ‌ని కూడా ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపించాయి.అయితే అప్ప‌ట్లో అలాంటిదేమీ లేద‌ని తేల్చేశారు.

మ‌రో రీమేక్‌లో సునీల్‌

హాస్య‌న‌టుడిగా మంచి ఊపు మీదున్న స‌మ‌యంలో అందాల రాముడుతో హీరోగా మారాడు సునీల్‌. త‌మిళ చిత్రానికి రీమేక్ అయిన ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది.