'అంజలి విక్రమాదిత్య' గా రానున్న నయనతార
Send us your feedback to audioarticles@vaarta.com
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ' ఇమైక్కా నొడిగళ్' తెలుగులో భాషలోకి అనువాదం అవుతుంది.. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ లు ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చి విజయవంతం అయిన ఈ చిత్రానికి తెలుగులో 'అంజలి విక్రమాదిత్య' టైటిల్ ని ఖరారు చేసారు.. ఆర్. అజయ్ గనన్ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, అధర్వ, రాశిఖన్నా లు ప్రధానపాత్రలు పోస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకునిగా కనిపించనున్నారు.
ఈ సినిమాలో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిధిపాత్రలో మెరవనున్నారు.. తమిళంలో క్యామియో ఫిలిమ్స్ బ్యానర్ పతాకంపై సీజే జయకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా, హిప్ హాఫ్ తమిళ సంగీతం, RD రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందించారు. డబ్బింగ్ కార్యక్రమాలు ఎంతో చురుకుగా సాగుతుండగా ఈ చిత్రాన్ని జనవరి లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments