మధ్యతరగతి యువతిగా నయన్
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. పెర్ఫార్మెన్స్ ఒరియెంటెడ్ క్యారెక్టర్లు కూడా చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కేరళకుట్టి నయనతార. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న నయన.. ఈ శుక్రవారం అనువాద చిత్రం 'కర్తవ్యం'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఆమె కలెక్టర్ పాత్రలో కనిపించనుంది .
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నయన ‘కో కో’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతిగా కనిపించనుంది. కొన్ని అనూహ్య ఘటనల వల్ల ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తనకు ఎదురైన సమస్యలను ఎలా అధిగమించిందనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథానాయకుడి పాత్ర లేని ఈ సినిమాకి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో నయనతార కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com