బాలయ్య కోసం నయన వచ్చేసింది
- IndiaGlitz, [Monday,August 21 2017]
లేడీ సూపర్‌స్టార్‌గా తమిళనాట రాణిస్తోన్న నయనతార.. తెలుగు సినిమా విషయంలో మాత్రం శీతకన్ను వేస్తోంది. ఆమె చివరి తెలుగు చిత్రం బాబు బంగారం విడుదలై సంవత్సరం దాటేసింది. ఇటీవలే బాలకృష్ణ 102వ చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు ఓకే చెప్పింది నయన్. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. నయన ఈ షెడ్యూల్లో జాయిన్ అయిందని తెలిసింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. మొత్తానికి ఏడాది తరువాత బాలయ్య కోసం నయన తెలుగు సినిమాల షూటింగ్ వచ్చేసిందన్న మాట. సింహా, శ్రీరామరాజ్యం చిత్రాల తరువాత బాలయ్య, నయన్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.