nayanthara : కవలలకు జన్మనిచ్చిన విఘ్నేష్- నయనతార , పెళ్లయి 5 నెలలే.. అప్పుడే ఎలా..?
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, నయనతార జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. వీరిద్దరూ తల్లీదండ్రులయ్యారు. పండంటి ఇద్దరు మగ కవలలకు వీరు జన్మనిచ్చారు. పెళ్లయి 5 నెలలు కూడా కాలేదు. అప్పుడే వీరికి కవల పిల్లలు ఎలా కలిగారనే అనుమానం మీకు రావొచ్చు. నయనతార అసలు గర్భవతి కూడా కాలేదుగా ఇదేలా సాధ్యం అనేగా మీ డౌట్. చాలా మంది స్టార్స్ లాగానే సరోగసి విధానం ద్వారా విఘ్నేష్ శివన్, నయనతారలు తల్లీదండ్రులయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. తను, తన భార్య ఇద్దరు కవలలకు అమ్మానాన్నలం అయ్యామని.. చాలా ఆనందంగా వుందని, తమ జీవితంలో కొత్త చాప్టర్ మొదలైందంటూ.. భార్యాభర్తలిద్దరూ పసిబిడ్డల పాదాలకు ముద్దు పెడుతోన్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
జూన్ 9న విఘ్నేష్‌ను పెళ్లాడిన నయన్:
ఇకపోతే.. సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్‌లు ఈ ఏడాది జూన్ 9న చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొత్త జంట హనీమూన్ వెళ్లొచ్చింది. ఇద్దరూ మ్యారేజ్ లైఫ్ బాగా ఏంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు.
చేతినిండా ప్రాజెక్ట్‌లతో నయనతార:
ఇటీవల ఆమె మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో నటించారు. ఈ సినిమా సూపర్‌హిట్ కావడం.. ఇప్పుడు ఇద్దరు కవలలకు జన్మనివ్వడంతో నయన్ ఫుల్ హ్యాపీగా వున్నారు. తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఆమె అభిమానులకు థ్యాంక్స్ నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నయనతార ప్రస్తుతం సినిమాల్లో బిజీగా వున్నారు. తమిళం, మలయాళంతో పాటు హిందీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ సరసన మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com