సక్సెస్ కొట్టిన లవర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్న కేరళకుట్టి నయనతార.. తెలుగులోనూ ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. రెండేళ్ల క్రితం సీనియర్ కథానాయకుడు వెంకటేష్‌తో ముచ్చటగా మూడో చిత్రం (బాబు బంగారం) చేసిన నయన్.. తాజాగా మరో సీనియర్ కథానాయకుడు బాలకృష్ణతో ముచ్చటగా మూడో చిత్రం 'జై సింహా' చేసింది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమాకి.. మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మెప్పిస్తోంది. సింహా, శ్రీరామ రాజ్యం తరువాత బాలయ్య, నయన్ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్‌గా నిలిచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు సైతం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అదే జనవరి 12న నయన్ తాజా ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన తమిళ అనువాద చిత్రం 'గ్యాంగ్' కూడా విడుదలైంది.
తమిళంలో తాన సేరంద కూటమ్ పేరుతో విడుదలైన ఈ సినిమా.. రెండు భాషల్లోనూ కలెక్షన్ల పరంగా మెప్పిస్తోంది. తొలి రోజు గ్యాంగ్‌కి ఆశించిన వసూళ్లు రాకపోయినా.. మూడో రోజు, నాలుగో రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. టాక్‌తో సంబంధం లేకుండా విజయపథంలో పయనిస్తోంది. మొత్తానికి ప్రేమపక్షులు (విఘ్నేష్, నయన్).. ఒకే రోజు విడుదలైన తమ కొత్త చిత్రాల సక్సెస్‌తో విజయానందంలో ఉన్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments