రెమ్యున‌రేష‌న్‌తో నిర్మాత‌కు షాకిచ్చిన న‌య‌న‌తార‌!!

  • IndiaGlitz, [Saturday,August 08 2020]

కోలీవుడ్ నిర్మాత‌ల ద‌గ్గ‌ర న‌య‌న‌తార ఎంత రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తుందో తెలియ‌దు కానీ.. టాలీవుడ్ సినిమాలు చేయాల‌ని వెళ్లే నిర్మాత‌ల‌కు మాత్రం క‌ళ్లు తిరిగే రెమ్యున‌రేష‌న్ చెబుతుంది. గ‌త ఏడాది ఈమె చిరంజీవి స‌ర‌స‌న ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో న‌టించినందుకుగానూ న‌య‌న‌తార‌కు ఆరుకోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ని వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు మ‌రో తెలుగు సినిమా నిర్మాత సుధాక‌ర్ రెడ్డి న‌య‌న‌తార‌ను క‌లిసి సినిమా చేయ‌మంటే చేస్తానంది కానీ.. ఆమె అడిగిన రెమ్యున‌రేష‌న్ విని షాక్ కావాల్సి వచ్చిందట ఆయ‌న‌కు. ఇంత‌కూ న‌య‌న‌తార ఎంత రెమ్యున‌రేష‌న్ అడిగి ఉంటుందంటావ్‌. అక్ష‌రాలా రూ.9 కోట్లు కోట్ చేసింద‌ని టాక్‌.

వివ‌రాల్లోకెళ్తే నితిన్ హీరోగా బాలీవుడ్ సూప‌ర్‌హిట్ మూవీ ‘అంధాదున్’ రీమేక్ సినిమా రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో టబు చేసిన పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. ఈ పాత్ర కోసం కొంత మంది సీనియ‌ర్ హీరోయిన్స్‌ను చిత్ర యూనిట్ సంప్ర‌దించిన‌ట్లు గ‌తంలో వార్త‌లు వినిపించాయి. ఆ కోవ‌లో ఈసారి న‌య‌న‌తార‌ను సంప్ర‌దిస్తే ఈ రేంజ్ రెమ్యున‌రేష‌న్ కోట్ చేసింద‌ని స‌మాచారం. నిర్మాత‌లు ఐదు కోట్ల రూపాయ‌ల‌కు వ‌ర‌కు ఓకే అనుకున్నారు కానీ.. న‌య‌న‌తార మాత్రం తాను కోట్ చేసిన రెమ్యున‌రేష‌న్‌కు త‌గ్గ‌డం లేద‌ట‌. పోనీ ఆమె అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇస్తే సినిమా చేస్తుంది. కానీ ప్ర‌మోష‌న్స్‌కు మాత్రం రాదు. మ‌రి నిర్మాత‌లు ఎందుకు ఆమె వైపు మొగ్గుచూపుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ‘అంధాదున్’ రీమేక్‌ను తెలుగులో మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కించ‌నున్నారు.

More News

లోయలో పడిపోయిన విమానం.. 20 మంది మృతి

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

ప్రముఖ సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి టాలీవుడ్‌పై పంజా విసిరింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఆ తరువాత ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం

రానా చిత్రంలో అతిథిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌..?

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

‘ఇండియ‌న్ 2’ షూటింగ్ బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయం అంద‌వేత‌

క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.