నయనతార పెళ్లైయిపోయింది..

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించి త‌న అందం, అభిన‌యంతో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న‌ అందాల తార న‌య‌న‌తార‌. శింబు తో ప్రేమాయ‌ణం సాగించింది. ఊహించ‌ని విధంగా లవ్ కి ఫుల్ స్టాప్ ప‌డింది. ఆత‌ర్వాత ప్ర‌భుదేవాతో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. ప్ర‌భుదేవా త‌న భార్య‌కి విడాకులు ఇచ్చి న‌య‌న‌తార‌తో పెళ్లి చేసుకోవ‌డానికి కూడా రెడీ అయిపోయాడు. ఇంత‌లో ఏమైందో ఏమో..ప్ర‌భుదేవా - న‌య‌న‌తార ల‌వ్ కి బ్రేక్ ప‌డింది. ఇలా రెండు సార్లు ల‌వ్ లో ఫెయిల్ అవ్వ‌డంతో ఆలోచ‌న‌లోప‌డి సినిమాల‌కు దూర‌మైంది. ఆఖ‌రికి ప్రేమ వ్య‌వ‌హారం నుంచి బ‌య‌ట‌ప‌డి కెరీర్ పై కాన్ స‌న్ ట్రేష‌న్ చేసింది. వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అనిపించుకుంటుంది. రెండు సార్లు ప్రేమ‌లో విఫ‌ల‌మైన న‌య‌న‌తార ఇక ప్రేమ‌లో ప‌డ‌దేమో అనుకున్నారు. కానీ...ముచ్చ‌ట‌గా మూడోసారి న‌య‌న‌తార ప్రేమ‌లో ప‌డింది.
ఈసారి డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శ‌శితో ప్రేమ‌లో ప‌డింది.అయితే... వీరిద్ద‌రు ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారంటూ కోలీవుడ్ లో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. ఇదే విష‌యం పై న‌య‌న‌తార ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ స్పందిస్తూ...న‌య‌న‌తార పెళ్లి చేసుకుంది అనేది వాస్త‌వం కాదు. కాక‌పోతే వారిద్ద‌రూ ల‌వ్ లో ఉన్నారు అని తెలియ‌చేసారు. అయితే న‌య‌న‌తార ఎక్క‌డికి వెళ్లినా త‌న ప్రియుడు విఘ్నేశ్ శ‌శిని తీసుకువెళుతుంది. అస‌లు...వ‌ద‌ల‌డం లేదు. ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేనంత ద‌గ్గ‌ర‌య్యార‌ట‌. ఇటీవ‌ల సైమా అవార్డ్స్ ఫంక్ష‌న్ కి కూడా న‌య‌న‌తార విఘ్నేశ్ ని తీసుకువెళ్లింది. స్టేజ్ పై న‌య‌న‌తార అవార్డు తీసుకుంటున్న‌ప్పుడు విఘ్నేశ్ ని స్టేజ్ పైకి ర‌మ్మ‌ని పిలిచింద‌ట‌. ఇంత‌లా అన్యున్యంగా ఉంటున్న న‌య‌న‌తార - విఘ్నేశ్ జంట‌ను చూసి...వార్త‌ల్లో ఉన్న‌ట్టు నిజంగానే వీళ్లిద్ద‌రూ ర‌హ‌స్యంగా పెళ్లి చేసేసుకున్నారేమో అని అనుకున్నార‌ట‌. అంతే కాదండోయ్..న‌య‌న్ - విఘ్నేశ్ జంట‌ను చూసిన వాళ్లు ఇక‌... వీళ్ల ల‌వ్ కి బ్రేక్స్ ఉండ‌వ్...బ్రేక్ అప్స్ ఉండ‌వ్ అంటున్నార‌ట‌. సో..న‌య‌న్ విఘ్నేశ్ ని పెళ్లి చేసుకోవ‌డం ఖాయం అనుకోవ‌చ్చు.

More News

వెంకీని టెన్ష‌న్ పెడుతున్న ర‌జ‌నీ..

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన లేటెస్ట్ మూవీ బాబు బంగారం. ఈ చిత్రాన్ని మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన బాబు బంగారం చిత్రాన్ని జులై 1న రిలీజ్ చేయాల‌నుకున్నారు.

ధృవ సెట్ లో సంద‌డి చేసిన బుడ‌త‌డు..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్నిసురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

వర్మ పై వీరప్పన్ భార్య ఎటాక్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా సినిమా తీసిన విషయం తెలిసిందే.

'క‌బాలి' మ‌ళ్లీ వెన‌క్కు వెళుతున్నాడా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కబాలి’. రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది. ధన్సిక కీలక పాత్రలో నటిస్తుంది.

జూలై 8న ఆదిత్య ఓం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'

మోడరన్‌ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన యూత్‌ఫుల్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'.