మాజీ ల‌వ‌ర్ పేరుని చెరిపేసిన న‌య‌న‌తార‌

  • IndiaGlitz, [Wednesday,April 15 2020]

ద‌క్షిణాది హీరోయిన్స్‌లో న‌య‌న‌తార‌కు ఉన్న క్రేజే వేరు. మూడు నాలుగు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డ‌మే కాదు. సినిమా ప్ర‌మోష‌న్స్‌కు రాన‌ని ముందే చెప్పేస్తుంది. ఆమెకు ఉన్న డిమాండ్ రీత్యా నిర్మాత‌లు కూడా ఓకే అంటుంటారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు న‌య‌న‌తార‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఆమె కూడా ఒక ప‌క్క స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే మ‌హిళా ప్రాధాన్య‌తా చిత్రాల్లోనూ న‌టిస్తుంటుంది.

సినిమాల విష‌యంలోనే కాదు.. ల‌వ్ ఎఫెర్స్‌తోనూ ఈమె వార్త‌ల్లో నిలిచిన వ్య‌క్తే. ఒక‌ప్పుడు శింబు, త‌ర్వాత ప్ర‌భుదేవాల‌తో పీక‌ల లోతు ప్రేమ‌లో మునిగింది. ప్ర‌భుదేవా విష‌యానికి వ‌చ్చేస‌రికి ప్ర‌భుదేవా, ఇద్ద‌రు ఇక పెళ్లి చేసుకోవ‌డ‌మే త‌రువాయి అనేంత క్లోజ్ అయ్యారు. ఆ స‌మ‌యంలో న‌య‌న‌తార త‌న చేతిపై ప్ర‌భుదేవా పేరుని ప‌చ్చ‌బొట్టుగా పొడిపించుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇద్ద‌రూ విడిపోయారు. ఇప్పుడు న‌య‌న‌తార విఘ్నేశ్ శివ‌న్‌తో ప్రేమాయ‌ణం నెరుపుతుంది. ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. తాజాగా న‌య‌న‌తార త‌న చేతిపై ఉన్న ప్ర‌భుదేవా పేరుని చెరిపేయించుకుని కొత్త టాబూ వేయించుకుంది. పాజిటివిటీ అనే టాటూ వేయించుకుంది న‌య‌న‌తార‌. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.