నయనతార నయా రికార్డ్

  • IndiaGlitz, [Monday,November 23 2015]

ప‌దేళ్ల‌కు పైగా హీరోయిన్‌గా న‌టిస్తున్నా.. న‌య‌న‌తార క్రేజ్ ఇసుమంత కూడా త‌గ్గ‌లేదు. వ‌రుస విజ‌యాల‌తో ఈ ఏడాదిలో ఫుల్‌ఫామ్‌లోకి వ‌చ్చిన న‌య‌న‌.. త‌మిళ‌నాట పారితోషికం విష‌యంలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

ఇంకా చెప్పాలంటే.. సౌత్‌లోనే ఏ హీరోయిన్ తీసుకోనంత రెమ్యూన‌రేష‌న్‌ని త‌న కొత్త చిత్రం కోసం అందుకోనుంద‌ని త‌మిళ‌నాట క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. విక్ర‌మ్ హీరోగా ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమా కోసం.. త‌న ప్ర‌జెంట్ స‌క్సెస్ గ్రాఫ్‌ని దృష్టిలో పెట్టుకుని న‌య‌న రికార్డ్ స్థాయిలో రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ని.. దానికి చిత్ర నిర్మాత‌లు కూడా ఓకే చెప్పార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

మూడు నెల‌ల గ్యాప్‌లో 'త‌ని ఒరువ‌న్‌', 'మాయ‌', 'నానుమ్ రౌడీదాన్' చిత్రాల‌తో మూడు వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నందునే న‌య‌న‌తార‌కి ఈ స్థాయి డిమాండ్ వ‌చ్చింది. ఏదీ ఏమైనా పారితోషికం విష‌యంలో న‌య‌న‌తార న‌యా రికార్డ్ క్రియేట్ చేసింద‌న్న‌మాట‌.