పొంగల్ రేసులో నయనతార చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలతో తమిళనాట బాణంలా దూసుకుపోతోంది కేరళకుట్టి నయనతార. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటినా.. కోలీవుడ్‌లో నయనకున్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. తని ఒరువన్, మాయ, నానుమ్ రౌడీదాన్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను ఈ ఏడాది పరంగా తన ఖాతాలో వేసుకున్న ఈ మలయాళ సుందరి.. డిసెంబర్లో రెండు సినిమాలతో సందడి చేసే అవకాశముందని ఆ మధ్య వార్తలు వినిపించాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆ రెండు చిత్రాలు కూడా పొంగల్‌కి రానున్నాయట. శింబుతో నయన రొమాన్స్ చేసిన 'ఇదు నమ్మ ఆళు'.. జీవాతో నయన ఆడిపాడిన 'తిరునాళ్'.. సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయని తమిళ తంబీలు చెప్పుకుంటున్నారు. నయనతార విజయాల పరంపరని ఈ సినిమాలు కొనసాగిస్తాయో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments