‘లూసీఫర్’ నుంచి తప్పుకున్న నయన్.. ఛాన్స్ కొట్టేసిన త్రిష!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించబోతున్న విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన అద్భుత విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం నయనతారను దర్శకుడు ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే తాజాగా దీనిపై కొంత మేరకు క్లారిటీ వచ్చేసింది.
ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాలో నటించేందుకు నయనతార నో చెప్పేసిందట. నయన్ వెనుకడుగు వేయడంతో ఆ అవకాశం త్రిషకు దక్కిందని టాక్. ఇప్పటికే త్రిష సంతకం కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘స్టాలిన్’ సినిమాలో త్రిష మెగాస్టార్‌కి జోడిగా నటించింది. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్‌కి సోదరి పాత్రలో నటించనుందని టాక్. ఈ చిత్రంలో హీరో సోదరి పాత్ర అత్యంత కీలకం. ఆ పాత్ర కోసం పలువురు ప్రముఖ కథానాయికలను పరిశీలించిన దర్శకనిర్మాతలు చివరికి నయనతారను ఎంచుకున్నట్టు సమాచారం. అయితే సోదరిగా నటించాల్సి రావడంతోనే తప్పుకుందో మరో కారణమో కానీ నయన్ మాత్రం వెనుకడుగు వేసిందని సమాచారం.
కాగా చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్య మూవీలో లీడ్ రోల్ పోషించాల్సిన త్రిష అనూహ్యంగా వైదొలిగి.. అంతే అనూహ్యంగా ‘లూసిఫర్’ రీమేక్‌లో ఛాన్స్ కొట్టేయడం విశేషం. ఈ సినిమాలో త్రిష భర్తగా ఎవరు నటించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆ పాత్ర పోషించే నటుడి పేరు కూడా కన్ఫామ్ అయ్యాక ఈ సినిమాలో నటీనటుల గురించి అధికారిక ప్రకటన వస్తుందట. కాగా.. హీరో అనుచరుడి పాత్రలో హీరో సత్యదేవ్ అలరించనున్నాడు. మలయాళంలో అయితే ఈ సినిమాలో హీరోయిన్ లేదు. కానీ తెలుగు రీమేక్‌లో మాత్రం ఉంటుందని సమాచారం. అలాగే తెలుగు నేటివిటీకి తగినట్టుగా సినిమాలో మార్పులు చేర్పులు సైతం చేయబోతున్నట్టు తెలుస్తోంది. మార్చి నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com