నయనతార 'కర్తవ్యం'.. ఉగాది సందర్బంగా మార్చి 16న విడుదల
- IndiaGlitz, [Wednesday,March 14 2018]
దక్షిణాది అన్ని భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ లతో విజయాల్ని సాధిస్తున్న నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా ట్రైడెంట్ ఆర్ట్స్ (Trident Arts ) పతాకం పై తమిళం లో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ గా నిలిచినా ఆరమ్ (Araam) చిత్రాన్ని తెలుగు లో కర్తవ్యం పేరుతో మార్చి 16 న విడుదల చేస్తున్నారు.
నయనతార ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పాత్రలో లీనమై నటించారు. ఇటీవల స్పెషల్ ప్రీమియర్ గా పాత్రికేయ మిత్రులకి వేశారు. చూసిన ప్రతి ఓక్క మిత్రుడు భావోద్వేగంతో తమ తమ ఫీలింగ్స్ ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు. ఇంత మంచి చిత్రాన్ని తెలుగు గు తీసుకువచ్చిన నిర్మాత శరత్‌మరార్ గారికి వారి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఈ స్పందన విన్న హీరోయిన్ నయనతార మాట్లాడుతూ.. గత ఎడాది తమిళంలో విడుదలయ్యి ఘనవిజయం సాధించిన ఆరమ్ చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేయటం చాలా ఆనందంగా వుంది. ఒక మంచి పాయింట్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు కళ్ళకు కట్టే విధంగా చిత్రీకరించిన తీరు ప్రశంశనీయం. మారు మూల పల్లెటూళ్ళలో చిన్న పిల్లు బొరు భావిలో ప్రమాదవశాత్తు పడిపోతుంటే అటు అధికారులు, ఇటు ప్రజలు ఆ పాపని కాపాడటానికి ప్రయత్నించే తీరు అభినందనీయం.
కాని దానికి కావలసిన వసతులు కల్పించక పోవటం చాలా భాదాకారం. ఈ విషయమే నన్ను ఈ చిత్రం చేయటానికి ముందుకొచ్చేలా చేసింది. తెలుగులో జర్నలిస్ట్ లు చూసి అభినందటం చాలా ఆనందంగా వుంది. వారికి నా తరుపున థ్యాంక్స్. ఉగాది సందర్బంగా మార్చి 16న ఈ చిత్రం విడుదలవుతున్న ఈ చిత్రం మనసున్న ప్రతి మనిషికి తప్పక నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ "తమిళం లో ఆరమ్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నయనతార కెరీర్ లోనే పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం మాకు ఉంది. ఇప్పటికే చిత్రాన్ని చూసిన మీడియా మిత్రులు చాలా మంచి రివ్యూస్ ఇవ్వటం నూతన ఉత్సాహన్ని కలిగించింది.
నిత్యం మనం న్యూస్ ఛానల్ లో చూస్తున్న బోరు భావిలో ఆడుకుంటున్న పిల్లలు పడిపోతే, అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కథా వస్తువుగా తీసుకుని రియలిస్టిక్ గా బాగా దగ్గరగా ప్రతి ఓక్కరి హ్రుదయం తడిసేలా అద్బుతమైన నేరేషన్ తో దర్శకుడు గోపి నైనర్ తెరకెక్కించాడు. ఆ ఆపరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ పాత్రలో నయనతార నటవిశ్వరూపానికి ప్రేక్షకులు జైజైలు కొట్టారు. ఈ చిత్రాన్ని మార్చి 16 న తెలుగు ప్రేక్షకులకి దగ్గరకి తీసుకువస్తున్నాం. అని అన్నారు.