మూడున్నర కోటి తీసుకుంటున్న నయనతార?
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్ రేట్ ఉంటే.. ఎంత డిమాండ్ చేసినా చెల్లుబాటవుతుంటుంది ఒక్కోసారి. ఆరేడేళ్ల క్రితం ఇలియానా కోటి రూపాయిల పారితోషికం తీసుకోవడం అప్పట్లో సంచలన వార్తగా నిలిస్తే.. ఇప్పుడు ఒకటిన్నర, రెండు కోట్ల పారితోషికం తీసుకోవడం హాట్ న్యూస్‌గా నిలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సౌత్ హీరోయిన్ రెమ్యూనరేషన్ రేంజ్ 3.5 కోట్ల రూపాయిలకి చేరిందని వినిపిస్తోంది.
అంత పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. తమిళంలో ఇటీవలే హ్యాట్రిక్ కొట్టిన లేడీ సూపర్ స్టార్ నయనతార. విక్రమ్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నయనతార నటించనుందని.. ఈ సినిమాకి నయన బాగానే కోట్ చేసిందని గత రెండు రోజులుగా న్యూస్ వినిపించింది.
అయితే.. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మొత్తం 3.5 కోట్ల రూపాయిలని తేలింది. ఇందులో ఏ మాత్రం వాస్తముందో త్వరలోనే తెలుస్తుంది. అన్నట్లు.. ఈ విక్రమ్ సినిమాకి మొదట అనుకున్న నిర్మాతలు ఇప్పుడు మారి వేరే వారు వచ్చి చేరారు. అలాగే హీరోయిన్లు కాజల్, బిందుమాధవిలు కూడా మారిపోయారు. అలా కాజల్ ప్లేస్‌లోకి నయన చేరింది. పెద్ద మొత్తమే పారితోషికంగా తీసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments