కరోనాపై పోరుకు నయన్ భారీ విరాళం..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్‌పై పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలకు అండగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతుగా ఆర్థిక విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ మొదలుకుని పలు సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన నటీనటులు తమవంతుగా విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. అంతేకాదు.. సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సైతం ప్రముఖులు అండగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా.. లేడీ సూపర్‌స్టార్ నయనతార తన వంతుగా విరాళంగా ప్రకటించింది. తన వంతు బాధ్యతగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా(ఫెఫ్సీ)కి రూ.20 లక్షల విరాళం ప్రకటించింది. ఈ విరాళం సౌతిండియాలో మొత్తం ఉండే కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఆమె ప్రకటిచింది. నయన్‌తో పాటు పలువురు నటీమణులు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఐశ్వర్య రాజేష్ తన వంతుగా లక్ష రూపాయలను విరాళంగా అందించింది. కష్టకాలంలో ఉన్న కార్మికులు, ప్రజలను ఆదుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకు రావాల్సి ఉందని సినీ పెద్దలు పిలుపునిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments