నయనతార అనుకున్నట్టే కొట్టేసింది
Send us your feedback to audioarticles@vaarta.com
అంతా అనుకున్నట్టే జరిగింది. కోలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న కేరళ కుట్టి నయనతార.. రెండు భారీ విజయాల తరువాత మూడో హిట్‌నీ తన ఖాతాలో వేసేసుకుంది. 'తని ఒరువన్', 'మాయ' (మయూరి).. వంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల తరువాత ఆమె హీరోయిన్‌గా నటించిన కొత్త చిత్రం 'నానుమ్ రౌడీదాన్' నిన్న రిలీజైంది. తమిళ నాట ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
'పిజ్జా' ఫేం విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార పోషించిన కాదంబరి పాత్ర ఆమె కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచేపోయేంతగా ఉందని విమర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో.. అంతా అనుకున్నట్టుగానే నయనతార హ్యాట్రిక్ కొట్టేసినట్లయింది. అన్నట్టు.. 'నానుమ్ రౌడీదాన్'తో పాటు రిలీజైన విక్రమ్, సమంతల '10 ఎండ్రత్తుకుల్ల'కి యావరేజ్ టాక్ వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com