నయన ప్రయత్నం ఈసారైనా వర్కవుట్ అవుద్దా?
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయికలు తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పడం అనేది ఈ తరంలో అరుదుగా జరిగే విషయం. ముఖ్యంగా సదరన్ మూవీస్లో మన హీరోయిన్లు అరువు గొంతులపై ఆధారపడుతుంటారు. ఎవరో నిత్యా మీనన్ లాంటి నాయికలు ప్రారంభం నుంచే డబ్ చెప్పుకుంటున్నారు. కానీ సింహభాగం నాయికలు డబ్బింగ్ ఆర్టిస్ట్స్పైనే డిపెండ్ అవుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. నయనతార తన తాజా తమిళ చిత్రం 'నానుమ్ రౌడీదాన్' కోసం డబ్బింగ్ చెప్పుకుంది. తమిళంలో ఆమె డబ్బింగ్ చెప్పుకున్న తొలి చిత్రం ఇది.
ఐతే దీని కంటే ముందు మన తెలుగు సినిమాల కోసం తన గొంతు విప్పింది నయన. 'కృష్ణం వందే జగద్గురుం' కోసం నయన తన పాత్రకి తనే గళం విప్పింది. తెలుగులో ఆమె చేసిన తొలి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి తమిళంలో అయినా ఆమె తొలి ప్రయత్నం వర్కవుట్ అవుద్దా? వేచి చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments