ఐదేళ్లుగా సహజీవనం.. నయనతార ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఇండియాలో హాటెస్ట్ కపుల్స్ లో నయనతార, విగ్నేష్ శివన్ జంట ఒకటి. వీరిద్దరూ 2015 నుంచి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ లో నయనతార లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది. వయసుతో సంబంధం లేకుండా నయన్ గ్లామర్ రోల్స్ , లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది.
సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ నయనతార. ఇక విగ్నేష్ శివన్ కూడా దర్శకుడిగా రాణిస్తున్నాడు. విహారయాత్రలు, విదేశీ టూర్లు, గుళ్ళు గోపురాలకు ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. కలసి జీవిస్తున్నప్పటికీ నయన్, విగ్నేష్ పెళ్లి ఊసే ఎత్తడం లేదు.
మీడియాకు కాస్త దూరంగా ఉండే నయన్..తన వక్తిగత విశేషాలని బయటకు చెప్పుకోదు. అభిమానుల్లో మాత్రం నయన్ పెళ్లి ఎప్పుడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది. తాజాగా విగ్నేష్ శివన్ మాత్రం తమ పెళ్లి గురించి సోషల్ మీడియాలో నోరు విప్పాడు.
సోషల్ మీడియా లైవ్ లో నయన్ తో పెళ్లి గురించి విగ్నేష్ కు ప్రశ్న ఎదురైంది. ఓ అభిమాని మీరు ఇంకా నయనతారని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించగా విగ్నేష్ సమాధానం ఇచ్చాడు. 'పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుతం నేను పెళ్లి కోసం డబ్బు సేవ్ చేస్తున్నా. కరోనా ప్రభావం తగ్గడం కోసం ఎదురుచూస్తున్నా'అని సమాధానం ఇచ్చాడు.
బహుశా అభిమాని అడిగాడు కాబట్టి విగ్నేష్ సరదాగా ఏదో ఒక సమాధానం ఇచ్చినట్లు ఉంది. లేకపోతే నయన్, విగ్నేష్ శివన్ దగ్గర లేని డబ్బా! అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 36 ఏళ్ల నయనతార కెరీర్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వయసు పెరిగేకొద్దీ ఆమె స్టార్ డం పెరడగం విశేషమే. గతంలో నయన్.. శింబు, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలు నడిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments