Bigg Boss 7 Telugu : మళ్లీ అమ్మాయే.. నయని పావని ఎలిమినేషన్, ఇంటి సభ్యులంతా కంటతడి .. ఎమోషనలైన నాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 7లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురిని ఇంటిలోకి పంపించిని బిగ్‌బాస్.. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన మరో ముగ్గురిని ఇంట్లోకి తెచ్చి ఒకరికి ఓటింగ్ ద్వారా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏకంగా వైల్డ్‌కార్డ్ ద్వారా ఇంట్రి ఇచ్చిన నయని పావనిని వారానికే ఇంటికి పంపేసి షాకిచ్చాడు. శనివారం నాటి ఎపిసోడ్‌లో దామిని, శుభశ్రీ, రతికలలో ఒకరికి ఛాన్స్ వుందని చెప్పి.. వారికి ఓటింగ్ పెడతామని చెప్పాడ్ నాగ్. వీరు ముగ్గురు తాము హౌస్‌లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నారో కారణం చెప్పి.. కంటెస్టెంట్స్‌ని మెప్పించాలని , ఓటింగ్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలిచినట్లని పేర్కొన్నాడు.
ఆదివారం వచ్చీ రాగానే ఈ ముగ్గురిలో ఒకరిని హౌస్‌లోకి పంపేందుకు గాను ఓటింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా బ్యాలెట్ బాక్సులో వాళ్లకు నచ్చిన కంటెస్టెంట్‌కి ఓటు వేశారు. ఓటింగ్ ముగిశాక షాకిచ్చారు నాగార్జున. అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి కాకుండా తక్కువ వచ్చిన వ్యక్తి హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని బాంబు పేల్చాడు. ఇంతలో ‘‘ భగవంత్ కేసరి ’’ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి, శ్రీలీల స్టేజ్ మీద సందడి చేశాడు. అనిల్ ఒక్కొక్కరి గురించి ఫన్నీగా చెబుతూ నవ్వించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో జ్ఞాపకాలు, బాలయ్యతో అనుబంధం గురించి చెబుతూ శ్రీలీల ఎమోషనల్ అయ్యింది. ఇక మధ్య మధ్యలో నామినేషన్స్‌లో వున్న వారిని సేవ్ చేశారు నాగార్జున. చివరిలో అశ్వినిశ్రీ, నయని పావని మిగిలారు. దీంతో ఈ వారం కూడా సెంటిమెంట్ ప్రకారం అమ్మాయే ఎలిమినేట్ అవుతుందని కంటెస్టెంట్స్‌కి, ఇంటి సభ్యులకు అర్ధమైపోయింది.
అనంతరం నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అశ్విని, నయని ముందు రెండు ఫిష్ బౌల్స్ వుంచారు. ఎవరి బౌల్ రెడ్ కలర్‌లో వుంటుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని చెప్పారు. నయని ఫిష్ బౌల్ రెడ్ కలర్‌లో వుండిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో నయని పావని ఎలిమినేట్ అయ్యింది. వారానికే తాను ఇంటి నుంచి వెళ్లిపోవడాన్ని ఆమెతో పాటు తోటి కంటెస్టెంట్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. నయని వెక్కి వెక్కి ఏడ్చింది.. ఆమెను ఇంటి సభ్యులు సైతం కంట్రోల్ చేయలేకపోయారు. శివాజీ ఆమెను పక్కకి తీసుకెళ్లి .. నువ్వు స్ట్రాంగ్ .. ఏడవొద్దు అని ఓదార్చాడు.
స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత కూడా అలాగే ఏడుస్తూనే వుంది. కంటెస్టెంట్స్ కూడా నయనిని చూసి కంటతడి పెట్టుకున్నారు. ఇన్నేళ్లలో ఓ కంటెస్టెంట్ కోసం ఇంటి సభ్యులంతా కన్నీళ్లు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అని స్వయంగా నాగార్జున సైతం ఎమోషనల్ అయ్యారు. ఇందరి అభిమానం సంపాదించిన ఈ అమ్మాయి జీవితంలో పైకొస్తుందని నాగ్ ఆశీర్వదించారు. అయితే ఇంటి సభ్యుల గురించి చెబుతూ శివాజీ గురించి కాస్త ఎమోషనల్ అయ్యింది నయని. ఆయనను డాడీ అంటూ పిలిచానని, రోజూ నిద్రలేవగానే హగ్ చేసుకునేదాన్ని అని నయని గుర్తుచేసుకుంది. శివాజీని బాగా మిస్ అవుతానని చెప్పింది. ఈ మాటలకు ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. అది ఎంతలా అంటే నయని బదులు తాను వెళ్లిపోతానని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com