నయనతార పైనే ఆశలన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది నయనతార. తని ఒరువన్, మాయ (మయూరి), నానుమ్ రౌడీదాన్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు గతేడాది ఆమె సొంతమయ్యాయి. దాంతో తమిళనాట లేడీ సూపర్‌స్టార్ గా ఆమె ప్రశంసలు పొందుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నయన నటించిన సినిమాలేవీ కోలీవుడ్‌లో సందడి చేయలేదు. అయితే ఈ వేసవిలో ఆమె హీరోయిన్గా రెండు సినిమాలు రానున్నాయి. వాటిలో ఒకటి తన మాజీ ప్రియుడు సింబుతో కలిసి నటించిన ఇదు నమ్మ ఆళ్ కాగా.. మరొకటి జీవా హీరోగా నటిస్తున్న తిరునాళ్.
ఈ ఇద్దరు హీరోలకి గత కొంత కాలంగా సరైన విజయాలు లేవు. దీంతో విజయం కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు సదరు కథానాయకులు. నయనతారకి ఇప్పుడున్న ఫామ్ అయినా.. తమకి సక్సెస్‌ని అందిస్తుందని ఆ హీరోలు ఆశాభావంతో ఉన్నారు. అన్నట్లు ఈ ఇద్దరు కూడా గతంలో నయనతో ఓ సినిమా చేసి విజయం సొంతం చేసుకుని ఉండడం అనేది ఆయా సినిమాలకి కలిసొచ్చే అంశం. ఇదు నమ్మ ఆళ్ ఏప్రిల్‌లో విడుదల కానుండగా.. తిరునాళ్ మేలో రిలీజ్ కానుంది. తెలుగులోనూ ఈ సినిమాలను డబ్బింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com