'వాసుకి' గా వస్తున్న నయనతార
Friday, April 7, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నయనతార ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి తనే పెద్ద ప్లస్. ఇటీవల నాయికాప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ కొత్త ఒరవడి సృష్టించుకున్న ఈ అందాల తార మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఈ సినిమా టైటిల్ `వాసుకి`. `పుదియ నియమం` అనే మలయాళ చిత్రానికి అనువాదమిది. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
చిత్రనిర్మాత ఎస్.ఆర్. మోహన్ మాట్లాడుతూ - ``ఈ సినిమా నయన్ కెరీర్‌కే ది బెస్ట్‌గా నిలుస్తుంది. ప్రతి మహిళా ఈ చిత్రంలో నయనతార పాత్రకు కనెక్ట్ అవుతారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సంబంధించి.. ప్రస్తుతం తెలుగులో అనువాదం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్లను ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేయనున్నాం. అన్ని పనులు పూర్తి చేసి మేలో సినిమాని రిలీజ్ చేస్తాం. గోపిసుందర్ సంగీతం సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది`` అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రఓబి వర్గీస్ రాజ్, సంగీతం: గోపి సుందర్, బ్యానర్: శ్రీరామ్ సినిమా, నిర్మాత: ఎస్.ఆర్.మోహన్, దర్శకత్వం: ఎస్.కె.షాజన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments