'వాసుకి' గా వస్తున్న నయనతార

  • IndiaGlitz, [Friday,April 07 2017]

న‌య‌న‌తార ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాకి త‌నే పెద్ద ప్ల‌స్. ఇటీవ‌ల నాయికాప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ కొత్త ఒర‌వ‌డి సృష్టించుకున్న ఈ అందాల తార మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌బోతోంది. ఈ సినిమా టైటిల్ 'వాసుకి'. 'పుదియ నియ‌మం' అనే మ‌ల‌యాళ‌ చిత్రానికి అనువాద‌మిది. శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్, ట్రైల‌ర్ రిలీజ్ చేసి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత‌ ప్లాన్ చేస్తున్నారు.
చిత్ర‌నిర్మాత ఎస్‌.ఆర్‌. మోహ‌న్ మాట్లాడుతూ - ''ఈ సినిమా న‌య‌న్ కెరీర్‌కే ది బెస్ట్‌గా నిలుస్తుంది. ప్ర‌తి మ‌హిళా ఈ చిత్రంలో న‌య‌నతార పాత్ర‌కు క‌నెక్ట్ అవుతారు. మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ చిత్రానికి సంబంధించి.. ప్ర‌స్తుతం తెలుగులో అనువాదం, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ ప‌నులు కొన‌సాగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ల‌ను ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో రిలీజ్ చేయ‌నున్నాం. అన్ని ప‌నులు పూర్తి చేసి మేలో సినిమాని రిలీజ్ చేస్తాం. గోపిసుంద‌ర్ సంగీతం సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది'' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ర‌ఓబి వ‌ర్గీస్ రాజ్‌, సంగీతం: గోపి సుంద‌ర్‌, బ్యాన‌ర్‌: శ్రీ‌రామ్ సినిమా, నిర్మాత‌: ఎస్‌.ఆర్‌.మోహ‌న్, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.కె.షాజ‌న్‌.

More News

'షాలిని' సినిమా పాటలు విడుదల

అమోఘ్ దేశ్ పతి,అర్చన,శ్రేయ వ్యాస్ నటీనటులుగా "లయన్" సాయి వెంకట్ సమర్పణలో స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై..నిర్మాత పి.వి. సత్యనారాయణ నిర్మించిన చిత్రం షాలిని.

64 వ జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాల హవా

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో `పెళ్లిచూపులు` సినిమా రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరితో పాటు, ఉత్తమ సంభాషణలకుగాను దర్శకుడు తరుణ్ భాస్కర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.

'గజేంద్రుడు' ఆర్య కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది - ఆర్.బి.చౌదరి

ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది.సీజీ వర్క్ అందుబాటులోకి రావడం ఒక పక్క మంచిదే అయినా,మరో పక్క అంతే రేంజ్ లో

క్రేజీ ప్రాజెక్ట్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్న 'దృశ్యకావ్యం' దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

పుష్యమి ఫిల్మ్ మేకర్స్ ఫిలింస్ పతాకంపై గతంలో 'దృశ్యకావ్యం'వంటి చిత్రాన్ని అందించిన దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి పుట్టినరోజు ఈరోజు(ఏప్రిల్ 7).

అనుష్క భాటలో శృతిహాసన్....

జయం రవి,ఆర్య,శృతిహాసన్ ప్రధాన తారాగణంగా ప్రముఖ నటి ఖుష్బూ భర్త,ప్రముఖ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో