'నాయకి' మళ్ళీ వెనక్కి వెళ్లుతుంది...?
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నై సొగసరి, హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకులకి నాయకి త్రిష దశాబ్దానికి పైగా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం త్రిష టైటిల్ పాత్రలో రాజ్ కందుకూరి సమర్పిస్తున్న సినిమా `నాయకి`. రెట్రో హర్రర్ ఎంటర్ టైనర్గా గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ చిత్రానికి గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మాతలు. గోవి దర్శకుడు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `ఎ` సర్టిఫికేట్ను పొందింది. నిర్మాతలు సినిమాను జూలై 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తారని వార్తలు వచ్చాయి. నిర్మాతలు కూడా అంతా సిద్ధం అయ్యారు. అయితే లెటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం జూలై 15న విడుదల కానుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిరాలు పడుతూ వస్తుంది. మరి ఇప్పుడైనా అనుకున్న తేదీన విడుదలవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments