నాయకి నా ఆఖరి సినిమా అంటున్నసత్యం రాజేష్..
Send us your feedback to audioarticles@vaarta.com
నిషా కళ్ల త్రిష నటిస్తున్న తాజా చిత్రం నాయకి. ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో రూపొందుతుంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్ననాయకి చిత్రంలో సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్నాడు. తను హీరోగా నటిస్తున్న నాయకి సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ...నాయకి నా ఆఖరి సినిమా అని చెప్పాడు.
ఏమిటి సత్యం రాజేష్ అప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడా అనుకుంటున్నారా..? అదేమి లేదండి...హీరోగా ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ నాయకి అని చెబుతున్నాడు. కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, అవసరమైతే నెగిటివ్ రోల్ అయినా చేస్తాను కానీ హీరోగా మాత్రం చేయను అంటున్నాడు. ఎందుకని అడిగితే...హీరోగా చేయడం అంటే అదో డిఫరెంట్ బాల్ గేమ్ అని చెబుతున్నాడు. సునీల్ ని చూసి తెలుసుకున్నాడేమో..తెలివైన నిర్ణయం తీసుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com