త్రిష 'నాయకి' సెన్సార్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకులకి నాయకి త్రిష పన్నెండేళ్లుగా సుపరిచితం. కెరీర్ ప్రారంభంలో మంచి క్రేజ్‌ని మూటగట్టుకున్నా.. ఓ స్థాయి తరువాత ఆ క్రేజ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. మళ్లీ మునుపటి హవా కొనసాగించేందుకు త్రిష ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం త్రిష టైటిల్ పాత్రలో రాజ్ కందుకూరి సమర్పిస్తున్న సినిమా `నాయకి`.
గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ చిత్రానికి గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మాతలు. గోవి దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `ఎ` సర్టిఫికేట్‌ను పొందింది. ప్రస్తుతానికి సినిమాను జూలై 1న రిలీజ్ చేస్తారని వార్తలైతే వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com