close
Choose your channels

త్రిష లోని మరో కోణాన్ని ఆవిష్కరించే నాయకి మంచి విజయాన్నిసాధించాలి - నందమూరి బాలకృష్ణ

Wednesday, April 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్ర క‌థానాయిక త్రిష న‌టించిన హ‌ర్ర‌ర్ మూవీ నాయ‌కి. ఈ చిత్రాన్ని గోవి తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన నాయ‌కి చిత్రాన్ని గిరిధ‌ర్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై గిరిధ‌ర్ మామిడిప‌ల్లి నిర్మించారు. ఫ‌స్ట్ టైమ్ త్రిష హ‌ర్ర‌ర్ మూవీలో న‌టించ‌డం ఓ విశేష‌మైతే..ఫ‌స్ట్ టైమ్ ఈ సినిమా కోసం సింగ‌ర్ గా మారి త్రిష ఓ పాట పాడ‌డం మ‌రో విశేషం. ర‌ఘు కుంచె సంగీతం అందించిన నాయ‌కి ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం హైద‌రాబాద్ జె.ఆర్.సి లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా హాజ‌రై నాయ‌కి ఆడియోను ఆవిష్క‌రించి తొలి సిడిని క‌ధానాయిక త్రిష‌కి అంద‌చేయ‌గా.. నాయ‌కి ట్రైల‌ర్ ను నిర్మాత అంబికా కృష్ణ రిలీజ్ చేసారు.
డైరెక్ట‌ర్ విజ‌య్ కుమార్ కొండ మాట్లాడుతూ... క్యూట్ గా ఉండే త్రిష నాయ‌కి ఫ‌స్ట్ లుక్ లో చాలా డిఫ‌రెంట్ గా క‌నిపించింది. క్ష‌ణం సినిమా నుంచి రాజేష్ డిఫ‌రెంట్ రోల్స్ చేస్తున్నాడు. ఈ సినిమాతో రాజేష్ కి మరింత పేరు వ‌స్తుంది. నాయ‌కి మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
గీత ర‌చ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల మాట్లాడుతూ...ఈ సినిమాలో అన్ని పాట‌లు రాసాను. గిరిథ‌ర్ - నేను జ‌ర్న‌లిస్ట్ లుగా కెరీర్ ప్రారంభించాం. గిరిథ‌ర్ సంస్థ‌లో రెండో సినిమాకి కూడా వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది. ర‌ఘు కుంచెతో మ‌రోసారి డిఫ‌రెంట్ సాంగ్స్ చేసే అవ‌కాశం ల‌భించింది. గోవి మంచి టాలెంట్ ఉన్న డైరెక్ట‌ర్. ఈ సినిమాలో భ‌యం అనే పాట ఉంది. ఈ పాట‌ను భ‌యం గురించి రోజు పేప‌ర్లో చూస్తున్న‌ వార్త‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాసాను.ఈ పాట‌ను త్రిష గారు బాగా పాడారు అన్నారు.
న‌టుడు గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్ మాట్లాడుతూ....ఫ‌స్ట్ టైమ్ ఆకాశ‌మంత సినిమాలో త్రిష తో క‌ల‌సి న‌టించాను. ఇప్పుడు నాయ‌కి త్రిష‌తో నేను న‌టించిన రెండో సినిమా. ఈ మూవీలో నాయ‌కి గా త్రిష అద్భుతంగా న‌టించింది. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ సినిమాకి ర‌ఘు కుంచె మంచి మ్యూజిక్ అందించారు. రాజేష్ కి ఈ సినిమాతో మంచి పేరు వ‌స్తుంది. ఢ‌మ‌రుకం త‌ర్వాత మ‌ళ్లీ మంచి క్యారెక్ట‌ర్ తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.
న‌టుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...డైరెక్ట‌ర్ గోవికి ఇది రెండో సినిమా అయినా తొలి సినిమాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా తీసారు. రాజేష్ షూటింగ్ కి హీరోలా త‌యారై వ‌చ్చేవాడు. నువ్వు హీరో అనుకుంటున్నావా ఏంటి..? అంటే అవును నేను హీరోనే అనేవాడు. రాజేష్ అన్న‌ట్టుగానే ఈ సినిమా ద్వారా హీరో అయినందుకు ఆనందంగా ఉంది. నా ఫేవ‌రేట్ హీరోయిన్ త్రిష న‌టించిన నాయ‌కి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ...బాల‌య్య ఆడియో ఫంక్ష‌న్ కి వ‌చ్చారంటే ఆ సినిమా ఖ‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంది. ర‌ఘు కుంచె ఎందుకో ర‌మ‌ణ‌మ్మ పాట ఎన్ని సార్లు విన్నామ‌ళ్లీ వినాల‌నిపిస్తుంది. మాస్ సాంగ్స్ ను అద్భుతంగా అందించ‌గ‌ల ర‌ఘు కుంచె మ‌రిన్ని విజ‌యాలు సాధించాలి. త్రిష ఓ పాట పాడింది. ఆ పాట వింటుంటే సింగ‌ర్ గా కూడా బిజీ అయిపోతుంది అనిపిస్తుంది. తెలుగు చ‌రిత్ర‌కారుల సినిమాలు చేయ‌గ‌ల క‌థానాయ‌కుడు ఎవ‌ర‌న్నా ఉన్నారంటే అది బాల‌కృష్ణే. తెలుగు వారి చ‌రిత్ర‌ను నేటి త‌రానికి తెలియ‌చేయ‌డానికి గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి అనే సినిమా చేస్తున్న బాల‌కృష్ణ‌ను అభినందిస్తున్నాను అన్నారు.
బాల‌కృష్ణ మాట్లాడుతూ... నాయ‌కి టైటిల్ న‌చ్చింది. నూత‌న సంవ‌త్స‌రంలో అనుకోకుండా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అనే సినిమా చేస్తున్నాను. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాయ‌కి ఆడియో వేడుక‌కు నేను రావ‌డం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. త్రిష గురించి చెప్పాలంటే...నాయ‌కి పోస్ట‌ర్స్ లో త్రిష ను చూస్తుంటే డిక్టేట‌ర్ లో నా క్యారెక్ట‌ర్ గుర్తుకువ‌స్తుంది. త్రిష అంటే అందం, అమాయ‌క‌త్వం, చిలిపిత‌నం గుర్తుకు వ‌స్తుంది. కానీ...త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుని నాయ‌కి సినిమా చేసింది. ఇలా వ‌చ్చిన అవ‌కాశాల‌ను వినియోగించుకుంటే మంచి పాత్ర‌లు వ‌స్తాయి. త్రిష ఈ సినిమాలో పాట‌ కూడా పాడింది. ఫ‌స్ట్ టైమ్ పాడిన‌ప్ప‌టికీ బాగా పాడింది. భాస్క‌ర‌భ‌ట్ల అన్ని పాట‌లు అద్భుతంగా రాసారు. స‌మాజంలో ఆడ‌వాళ్ల పై ఎన్నో దాడులు జ‌రుగుతున్నాయి. అందుక‌నే మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వం పెర‌గాల‌నే నా సినిమాలో స్త్రీ లేనిదే సృష్టే లేద‌ని చెప్పాను. ఈ సినిమాలో కూడా మంచి సందేశం ఉంటుంది అనుకుంటున్నాను. నాడు క‌మ‌ల్ హాస‌న్ నాయ‌కుడు అనే టైటిల్ తో వ‌స్తే నేడు త్రిష నాయ‌కి అంటూ వ‌స్తుంది. త్రిష లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే నాయ‌కి మంచి విజ‌యాన్ని సాధించాలి అన్నారు.
స‌త్యం రాజేష్ మాట్లాడుతూ...వ‌ర్షం సినిమా నుంచి త్రిష అలాగే ఉన్నారు. ఆమెలో ఎలాంటి మార్పులేదు. త్రిష గారితో క‌ల‌సి వ‌ర్క్ చేసినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ గోవి కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ...త్రిషను సింగ‌ర్ గా నేను ప‌రిచ‌యం చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. త్రిష సింగ‌ర్ గా కూడా రాణించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఓ 10 సార్లు భ‌యప‌డితే 15 సార్లు న‌వ్విస్తుంది. నాయ‌కి అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.
నిర్మాత గిరిధ‌ర్ మామిడిప‌ల్లి మాట్లాడుతూ...రంప చోడ‌వ‌రంలో నంద‌మూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ కి సెక్ర‌ట‌రీగా వ‌ర్క్ చేసాను. ఫిలిం జ‌ర్న‌లిస్ట్ గా ఉన్న‌ప్పుడు ఓరోజు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అన్న‌గారితోనే ఉన్నాను. ఆరోజును ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఈరోజు నేను నిర్మాత అయి అన్న‌గారి న‌ట వార‌సుడు బాల‌య్య బాబు చేతుల మీదుగా నా సినిమా ఆడియో రిలీజ్ అవ్వ‌డం కూడా ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఆడియో వేడుకు విచ్చేసిన బాల‌కృష్ణ గార్కి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. త్రిష కి ఏడెనిమిది సంవ‌త్స‌రాలుగా ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ గా వ‌ర్క్ చేసాను. నా బ్యాన‌ర్ లో త్రిష‌తో మంచి సినిమా చేయాల‌నే ఉద్దేశ్యంతో అడ‌గ‌గానే ఒకే అన్నారు. హ‌ర్ర‌ర్ జోన‌ర్లో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ ఈ సినిమా హ‌ర్ర‌ర్ లో ఓ కొత్త కోణంతో రూపొందించాం. త్రిష కెరీర్ లో బెస్ట్ ప‌ర్ ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుంది.రివార్డ్స్ తో పాటు అవార్డ్ కూడా వ‌స్తుంది అనుకుంటున్నాను. నా సినిమాలో త్రిష పాట పాడ‌డం నిజంగా నా అదృష్టం. మంచి సాహిత్యం అందించిన భాష్క‌ర‌భ‌ట్ల‌, సంగీతం అందించిన ర‌ఘు కుంచెకి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
చిత్ర స‌మ‌ర్ప‌కుడు రాజ్ కంద‌కూరి మాట్లాడుతూ...మ‌నం ఎన్ని సినిమాలు చేసాం అనేది కాదు. ఎన్ని మంచి సినిమాలు చేసామ‌నేదే గుర్తుంటుంది. నేను ఇప్ప‌టి వ‌ర‌కు 9 సినిమాలు చేసాను. కానీ ఈ సినిమా నాకు ఎప్ప‌టికీ గుర్తుంటుంది. కొత్త పాయింట్ తోడైరెక్ట‌ర్ గోవి ఈ చిత్రాన్ని చాలా బాగా తీసారు. న‌ట సింహం బాల‌కృష్ణ గారు మా ఆడియో ఫంక్ష‌న్ కు రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ గోవి మాట్లాడుతూ...బాల‌కృష్ణ గారి ల‌య‌న్ సినిమా షూటింగ్ లో త్రిష గార్కి ఈ క‌థ చెప్పాను. ఆ స‌మ‌యంలో బాల‌కృష్ణ గార్ని చూడ‌గానే నాలో ఏదో తెలియ‌ని పాజిటివ్ ఫీలింగ్ క‌లిగింది. ఆ పాజిటివ్ ఫీలింగ్ వ‌ల‌నే త్రిష గార్కి క‌థ న‌చ్చింది అనిపించింది. మ‌ళ్లీ ఇప్పుడు నా సినిమా ఆడియో ఫంక్ష‌న్ కి బాల‌కృష్ణ గారు రావ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమాకి బాల‌కృష్ణ గార్కి ఏదో అనుబంధం ఉంద‌నిపిస్తుంది. నా తొలి చిత్రం ల‌వ్ యు బంగారం ఫ్లాప్ అయినా న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చినందుకు నిర్మాత గిరిధ‌ర్, చిత్ర స‌మ‌ర్ప‌కుడు రాజ్ కుందుకూరి కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ సినిమా ద్వారా స‌త్యం రాజేష్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాను. ఈ చిత్రంలో పూనం కౌర్, మాధ‌విల‌త‌, నారా రోహిత్ గెస్ట్ రోల్స్ చేసారు. పాస్ట్ ప్ర‌జెంట్ లో ఈ క‌థ ఉంటుంది. ప్ర‌తి పోస్ట‌ర్ లో క‌థ తెలిసేలా డిఫ‌రెంట్ గా డిజైన్ చేసాం. డిఫ‌రెంట్ గా ఉన్న ఈ పోస్ట‌ర్స్ న‌చ్చే రాజ‌మౌళి గారు నాయ‌కి పోస్ట‌ర్స్ గురించి ట్వీట్ చేసారు. రాజ‌మౌళి గారి ట్వీట్ తో మా నాయ‌కి పై మ‌రింత క్రేజ్ పెరిగింది. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి గార్కి ధ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
హీరోయిన్ త్రిష మాట్లాడుతూ...ర‌ఘు కుంచె మంచి మ్యూజిక్ అందించారు. నాతో సాంగ్ పాడించారు. నాయ‌కి కోసం ఎంత‌గానో హార్డ్ చేసిన‌ మా వండ‌ర్ ఫుల్ టీమ్ కి థ్యాంక్స్ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్స్ భీమ‌నేని, ఎన్. శంక‌ర్, ద‌శ‌ర‌థ్, అనిల్ రావిపూడి, నిర్మాత దామోద‌ర్ ప్ర‌సాద్, నిర్మాత శివ కుమార్, ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్, సురేష్ కొండేటి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment