ఫైనాఫిల్ తిన్న ఏనుగు మృతి.. షేమ్ అన్న నవాజుద్దీన్

  • IndiaGlitz, [Thursday,June 04 2020]

కేరళలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగు ప్రాణాలను తీసాడు ఓ హంతకుడు. పూర్తి వివరాల్లోకెళితే.. మలప్పురం జిల్లాలో మే 27న జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అటవీశాఖ అధికారి మోహన్ క్రిష్ణన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గర్భిణి అయిన ఓ గర్భిణి ఏనుగు ఆకలితో అలమటిస్తూ అడవికి సమీపంలో ఉన్న ఓ గ్రామంలోకి ప్రవేశించింది. వీధుల్లో తిరుగుతుండగా ఆ ఏనుగుకు ఓ ఆకతాయి పైన్ ఆపిల్ ఇచ్చాడు. ఆకలితో ఉన్న ఏనుగు ఆహారం దొరికింది కదా..? అని తిన్నది. అయితే తిన్న కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. తీవ్ర రక్తస్రావంతో ఆ ఏనుగు పరుగులు తీసి సమీపంలోని దగ్గర్లోని వెల్లలియార్ అనే నది దగ్గరికి వెళ్లి తొండాన్ని నీళ్లలో ఉంచింది.

అసలేం జరిగింది..!?

స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఏనుగును రక్షించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి సాయంత్రం 4గంటలకు ఆ ఏనుగు కన్నుమూసింది. అయితే.. ఆ ఏనుగుకు ఆ ఆకతాయి ఎందుకిలా ఫైనాఫిల్ పెట్టాడు..? అసలేం జరిగింది..? దీనివెనుకున్న వ్యూహమేంటి..? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఆ ఆకాతాయిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వెంటనే ఆ దుండగుడ్ని కఠినంగా శిక్షించాలని సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ డిమాండ్ చేస్తున్నారు.

సెలబ్రిటీల స్పందన ఇదీ..

బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజ్ సిద్ధిఖీ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ..‘ సిగ్గో సిగ్గు.. ఈ ఘటన చూసిన తర్వాత చాలా బాధేసింది. నిజంగా మానవుడిగా ఉండటానికి సిగ్గుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌ను కేరళ సీఎం పినరయివిజయన్, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో పలువురికి ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశాడు. ఈ సంఘటనపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందిస్తూ జంతువులను వేధిస్తున్న వారి కోసం కఠినమైన చట్టాలను తేవాలని డిమాండ్ చేశారు.