న్యూక్లియ‌ర్ ప్లాంట్‌లో 'న‌వాబు'

  • IndiaGlitz, [Saturday,June 02 2018]

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం పేరు చెప్ప‌గానే హిట్లూ, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా అప‌రిమిత‌మైన క్రేజ్ ధ్వ‌నిస్తుంటుంది. ఆయ‌న ఎంపిక చేసుకునే స‌బ్జెక్టులు అలాంటివి మ‌రి. ఆ మ‌ధ్య 'ఓకే బంగారం', 'చెలియా' తీసిన మ‌ణిర‌త్నం తాజాగా ఓ సోష‌ల్ థ్రిల్ల‌ర్‌ను ఎంపిక చేసుకున్నారు. దానికి న్యూక్లియ‌ర్ ప్లాంట్ నేప‌థ్యంలో క‌థ‌ను అల్లుకున్నారు.

విజ‌య్ సేతుప‌తి, జ్యోతిక‌, అదితిరావు హైద‌రి, అరుణ్ విజ‌య్‌, శింబు, అర‌వింద్ స్వామి, డ‌యానా, ఐశ్వ‌ర్య రాజేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ధారులు. త‌మిళంలో చెక్క‌చెవంద వానంగా రూపొందుతోన్న ఆ సినిమాకు తెలుగులో 'న‌వాబు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఆ మ‌ధ్య అబుదాబీలో షూటింగ్ జ‌రిగింది. సెర్బియాలో జ‌రిగిన షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్త‌యింది.