వివాదస్పద అంశాలతో 'నవాబ్'
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'నవాబ్'. కుటుంబనేపథ్యంతో సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మణిరత్నం అనేక వివాదస్పద అంశాలను టచ్ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ అంశాలే చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిసింది. గతంలో కూడా మణిరత్నం.. 'బొంబాయి', 'రోజా' సినిమాలను సున్నితమైన వివాదాంశాలతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా.. ఈసారి అణు కర్మాగార నిర్మాణ నేపథ్యంగా పర్యావరణ ఉల్లంఘన, మానవ హక్కులు వంటి వివాదాస్పదమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
అలాగే.. మూడు దశాబ్దాల వ్యవధిలో మధ్యతరగతి కుటుంబం సంబంధాలలో వచ్చిన మార్పులను కూడా ఈ చిత్రంలో చూపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ స్వరాలను సమకూరుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments