నవనీత్ కౌర్ కు షాక్.. క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు, ప్రమాదంలో పదవి!
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు ఊహించని షాక్ ఎదురైంది. ఫేక్ సర్టిఫికేట్ విషయంలో ఆమె వివాదం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం బాంబే హై కోర్టు నుంచి ఆమెకు గట్టి దెబ్బ తగిలింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు కోర్టు చర్యలు తీసుకుంది.
ఇదీ చదవండి: వావ్.. ఇద్దరు యంగ్ బ్యూటీస్ తో రాజశేఖర్ రొమాన్స్
నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ని కోర్టు రద్దు చేసింది. రూ.2 లక్షల ఫైన్ కూడా విధించింది. నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె తన పదవిని కోల్పోయే ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.
నవనీత్ కౌర్ తన పదవిని ఎలా కాపాడుకుంటారో అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఆమెకు ఎంపీగా కొనసాగే అర్హత లేదంటూ శివసేన మాజీ ఎంపీ ఆనందరావు సవాల్ చేశారు. తాను శివసేన ప్రభుత్వం నుంచి ఆ పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నవనీత్ కౌర్ చెబుతోంది.
మార్చిలో శివసేన నేత అరవింద్ సావంత్ లోక్ సభ లాబీలో తనని బెదిరించినట్లు ఆరోపించింది. శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో మాట్లాడితే జైలుకి పంపిస్తామని బెదిరించినట్లు నవనీత్ తెలిపింది. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. తనకు శివసేన నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, యాసిడ్ దాడి చేస్తామని కూడా బెదిరిస్తున్నట్లు నవనీత్ కౌర్ తన ఫిర్యాదులో పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout