నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా 'నవీన్ పోలిశెట్టి'. ఈరోజు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల చేశారు చిత్ర బృందం. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం.
ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటున్నారు. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన పేరు,మరిన్ని వివరాలను, విశేషాలను త్వరలోనే మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments