ఏం చదివినా నమ్మకండి అంటూ నవీన్ పోలిశెట్టి ట్వీట్!
Send us your feedback to audioarticles@vaarta.com
కెరీర్ ఆరంభంలో నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఇప్పుడు హీరోగా రెండు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు చిత్రాలతో నవీన్ ఒక రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దీనితో నవీన్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది.
నవీన్ తన థర్డ్ మూవీని ఇంకా ప్రకటించలేదు. ఓ నెటిజన్ తనపై ప్రశంసలు కురిపించగా ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ తన తదుపరి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి.
ఇదీ చదవండి: వైజాగ్ రామానాయుడు స్టూడియోపై కన్ను.. సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు?
'థాంక్ యు సోమచ్.. నా తదుపరి మూడు చిత్రాల కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నా సోషల్ మీడియా హ్యాండిల్ లో త్వరలోనే ప్రకటిస్తాను. ''ఇంకెక్కడా ఏం చదివినా నమ్మకండి- అల్బర్ట్ ఐన్ స్టీన్''. ఓ పెద్ద నిర్మాణ సంస్థతో కలసి వర్క్ చేయడం కల లాంటిది. మీ కోసం తయారు చేస్తున్న వాటిపై చాలా ఆసక్తిగా ఉన్నా' అని నవీన్ తెలిపాడు.
తనదైన శైలిలో ఫన్ మిక్స్ చేసి ఈ ప్రకటన చేశాడు. నవీన్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ పై ప్రశంసలు దక్కుతున్నాయి. పెద్ద డైలాగులని సైతం అలవోకగా చెప్పి నవ్వించగల సత్తా ఉన్న నటుడు నవీన్. జాతి రత్నాలు తర్వాత నవీన్ చేయబోయే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయనడంలో సందేహం లేదు. నవీన్ తదుపరి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Thank you so much ❤️ Script work going on for the next three movies. Will be announcing them soon on my handle “Inkekkada yem chadivina nammakandi” - Albert Einstein . It’s been a dream to work with the biggest production houses. Super excited about what’s in store for you guys. https://t.co/V6hoYBWX8q
— Naveen Polishetty (@NaveenPolishety) July 3, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments