Naveen Polishetty: స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ పోలిశెట్టి, బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Monday,December 26 2022]

యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, (Naveen Polishetty)అందాల తార అనుష్క శెట్టి (Anushka Shetty) హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. సోమవారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. కామెడీ టైమింగ్ లో మంచి పేరున్న నవీన్ స్టాండప్ కమెడియన్ గా మరింతగా నవ్వించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి సంగీతం - రధన్, సినిమాటోగ్రఫీ- నీరవ్ షా, ఆర్ట్ - రాజీవన్ నంబియార్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాణం - యూవీ క్రియేషన్స్.

More News

Tollywood: నేనొచ్చేశా, బీ రెడీ అంటోన్న కరోనా.. టాలీవుడ్‌లో మొద‌లైన‌ టెన్ష‌న్‌?

కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ కష్టాలు అన్నీ ఇన్ని కావు.

Trisha Krishnan : కాంగ్రెస్‌లోకి  త్రిష.. తమిళనాట కలకలం, పొలిటికల్ ఎంట్రీపై ఆమె ఏమన్నారంటే..?

భారతదేశంలో సినీ తారలకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం వుంది.

Rewind 2022: భారీ అంచనాలతో వచ్చి బోల్తా పడ్డ చిత్రాలు

ప్రతీ ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ వుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే విజయం సాధిస్తూ వుంటాయి.

Chalapati Rao: రోజుల వ్యవధిలో మరో విషాదం... నటుడు చలపతిరావు కన్నుమూత, షాక్‌లో టాలీవుడ్

2022వ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది. ఒకరి వెంట ఒకరిని సినీ దిగ్గజాలను తనతో పాటు తీసుకుపోతోంది.

Hari Hara Veera Mallu: 'హరి హర వీర మల్లు'లో బాబీ డియోల్

భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రాలలో 'హరి హర వీర మల్లు' ఒకటి.