త‌మిళంలోకి న‌వీన్ పొలిశెట్టి చిత్రం

  • IndiaGlitz, [Tuesday,November 12 2019]

న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన న‌వీన్ పొలిశెట్టి బాలీవుడ్‌లోనూ స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌లు చిత్రాల‌కు ప‌నిచేశారు. ఈ ఏడాది ఈయ‌న 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌'తో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. రెండో చిత్రంగా బాలీవుడ్‌లో 'చిచోరే'లో న‌టించారు. ఈ చిత్రం కూడా మంచి విజ‌యాన్ని దక్కించుకుంది. చిన్న సినిమాగా విడుద‌లైన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌' ఈ ఏడాది భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి స్వ‌రూప్ డైరెక్ట‌ర్‌. రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మాత‌. ఈ సినిమాలో న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తూనే స్క్రీన్‌ప్లేలోకూడా భాగ‌మ‌య్యాడు. బేసిక్‌గా న‌వీన్ స్క్రీన్ ప్లే రైట‌ర్ కావ‌డంతో ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లుచుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను త‌మిళంలో రీమేక్ చేస్తున్నార‌ని స‌మాచారం. త‌మిళంలో స్టార్ క‌మెడియ‌న్‌గా పేరున్న సంతానం ఈ సినిమాలో టైటిల్ పాత్ర‌ను పోషిస్తాడ‌ని స‌మాచారం.

కాగా న‌వ‌న్ పొలిశెట్టి ప్ర‌స్తుతం పిట్ట‌గోడ ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు నాగాశ్విన్ నిర్మాత‌గా మారుతున్నాడు. స్వ‌ప్న ద‌త్‌, ప్రియాంక ద‌త్‌లు కూడా ఇందులో నిర్మాత‌లే. ఈ చిత్రానికి జాతిర‌త్నాలు అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన లుక్ కూడా విడుద‌లైంది.

More News

వ‌రుణ్ తండ్రిగా కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే

'జార్జ్‌రెడ్డి'.. పవన్, వరుణ్‌తో తీద్దామనుకున్నా కానీ...!

తెలుగులో వరస పెట్టి బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బయోపిక్‌లకే ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది కూడా. ఇప్పటికే పలు బయోపిక్‌లు వచ్చి వెళ్లిపోగా..

జగన్.. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు: పవన్ వార్నింగ్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తన పెళ్లిళ్లు, పిల్లలపై వైఎస్ జగన్ మాట్లాడటంతో ఇందుకు స్పందించిన పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్.. మీరూ పెళ్లి చేస్కోండి..: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పెళ్లిళ్లు, పిల్లలపై ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహా ‘పీఠం’పై కూర్చోవాలని అటు బీజేపీ.. ఇటు శివసేన.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ కూర్చోవాలని విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ఫలించలేదు.