అసలైన జాతిరత్నాలు వాళ్లే.. సెటైరికల్‌గా చెప్పట్లేదు: నవీన్ పొలిశెట్టి
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకూ నవీన్ పొలిశెట్టి పేరు వినగానే గుర్తొచ్చేది ‘ఏజెంట్’. దాని నుంచి బయటకు వచ్చేందుకు చేసిన సినిమాయే ‘జాతిరత్నాలు’ అని నవీన్ పొలిశెట్టి తెలిపాడు. నవీన్ నటించిన‘జాతిరత్నాలు సినిమా గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నవీన్ పొలిశెట్టి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
నా తొలి రెండు చిత్రాలు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, హిందీలో ‘చిచ్చోరే’ హిట్ అయ్యాయి. దాంతో మూడో చిత్రంపై కాస్త ఒత్తిడి ఉండేది. ప్రేక్షకుల అంచనాలు అందుకునే మంచి కథ కోసం ఎదురుచూశాను. ఆ సమయంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ ఫోన్ చేసి ఓ కథ విని, నువ్వు చేస్తే బాగుంటుందన్నారు. సరే అని దర్శకుడు అనుదీప్‌ని కలిసి నరేషన్ విన్నాను. నా పేరు ఎవరికీ తెలీదు కానీ నేనెక్కడికెళ్లినా ఏజెంట్ అనే పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్ర ప్రభావం చూపింది. ఎక్కడికెళ్లినా ఏజెంట్ అని పిలుస్తున్నారు. ఆ సమయంలో జోగిపేట శ్రీకాంత్ పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. అలా అని అదే తరహాలో మరో చిత్రం చేస్తే కొత్తేమీ ఉండదు. ఎలాంటి పాత్ర పోషిస్తే దీన్ని నుంచి బయటపడొచ్చు అనుకుంటున్నప్పుడు ఈ కథ వచ్చింది. ఇది అయితేనే ఏజెంట్‌ని మరిపిస్తుందనిపించింది. నటుడిగా నాకూ సంతృప్తి ఉంటుందని ఓకే చేశాను. తర్వాత డ్రీమ్ ప్రాజెక్టులా మారిపోయింది.
సెటైరికల్‌గా పెట్టాం..
కథ మమ్మల్ని లీడ్ చేస్తుంది. ‘జాతిరత్నాలు’ అని చాలా సెటైరికల్‌గా పెట్టిన టైటిల్. దేశానికి సేవ చేసిన వాళ్లని, గొప్ప గొప్ప వాళ్లని ‘జాతి రత్నాలు’ అని పిలుస్తుంటారు. ఏదైనా ఆఫీసులో ఎవరైనా పని చేయని వారుంటే వారిని వచ్చాడురా జాతిరత్నం అంటుంటాం.అలా పెట్టిందే ఆ పేరు. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నటుల్ని ఎంపిక చేసుకుని ఇలాంటి సదవకాశం ఇచ్చిన అసలైన జాతి రత్నాలు మా నిర్మాతలైన స్వప్న, ప్రియాంక, నాగ్ అశ్విన్. . ఇది సెటైరికల్‌గా చెబుతున్న మాట కాదు. ప్రతిభను గుర్తించి మాపై నమ్మకంతో రూపొందించారు. నాగ్ అశ్విన్‌తో గతంలోనే పరిచయం ఉంది. నాకు ఫోన్ చేసి ఎవరూ చేయలేరు.. నువ్వే చెయ్యాలి అన్నప్పుడు చాలా ప్రెజర్ ఫీలయ్యాను.
అనుదీప్‌ని టార్చర్ పెట్టేవాడిని..
ఈ సినిమా, క్యారెక్టర్ చాలా డిఫరెంట్. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు. రాత్రి పూట కూడా అనుదీప్‌కి ఫోన్ చేసి టార్చర్ పెడుతుండేవాడిని. చిత్రీకరణకు వెళ్లే ముందు రోజు రాత్రి సన్నివేశానికి తగిన సంభాషణలు ప్రిపేర్ అవడం నాకు అలవాటు. చిత్రీకరణ సమయంలో అనుదీప్ హడావిడి చేసేవాడు (నవ్వుతూ..) టక్కున ఒక టేక్ తీసుకుని.. సీన్ పూర్తవకముందే కట్ చెప్పేసి మరొకటి తీద్దాం అనేవాడు. నాకేమో ఒకే సన్నివేశాన్ని రెండు మూడు రకాలుగా చేసి ఎడిటింగ్ సమయంలో ఏది బాగుంటే అది ఓకే చేయాలనిపించేది. స్టార్టింగ్‌లో ఇంత త్వరగా కట్ చేస్తున్నాడేంటని నాకు భయమేసేది.
అమాయకంగా ఉంటూనే దుర్మార్గుడిగా..
కథలోంచి కామెడీ పుడుతుంది తప్ప కామెడీ కోసం తీసిన సినిమా కాదు. ఇందులోని పాత్రలు అమాయకంగా ఉంటూనే దుర్మార్గుడిగా ఉంటుంది. అంటే పక్క వాళ్లని భయపడేలా చేస్తాయి. రాహుల్, ప్రియదర్శి సెట్లో చాలా సరదాగా ఉండేవాళ్లు. ఈ ఇద్దరి టైమింగ్‌కి తగినట్టు స్పాట్లోనే చాలా సన్నివేశాలకి మెరుగులుదిద్దాం. ట్రైలర్ చూసి ఈ చిత్రం కొత్తగా ఉందనుకుని ప్రేక్షకుల థియేటర్‌కి రావాలి. అలా చేసిన ప్రయత్నమే ఇది. కరోనా కారణంగా వచ్చిన ప్రతి ఒక్కరి ఒత్తిడిని ఈ సినిమా తగ్గిస్తుంది. ప్రేక్షకులు తమ కష్టాలు కాసేపు పక్కన పెట్టి వినోదాన్ని ఆస్వాదిస్తే చాలు.. నటుడికి కావాల్సిన రెమ్యునరేషన్ అంతకుమించి ఏం ఉంటుంది. చిట్టి సాంగ్ క్యూట్ లవ్ సాంగ్. ఆ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది.
థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి కారణం ఇదే..
ఈ సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి కారణం.. ఒక టఫ్ ఇయర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇలాంటి సినిమాచూసి సంతోషంగా బయటకు వస్తే ఆ థ్రిల్లే వేరు. ‘చిచోరే’ తర్వాత బాలీవుడ్లో మరో మూవీ చేశా. ఈ మూవీ ఇయర్ ఎండింగ్‌కి విడుదల అవుతుంది. లాక్డౌన్ సమయంలో ఓటీటీలో నటించేందుకు అవకాశాలొచ్చాయి. కానీ, నాకే రిస్క్ ఎందుకని చేయాలనిపించలేదు. షూటింగ్‌కి ఎక్కడెక్కడికో వెళ్లాలి. నా వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకూడదనుకున్నాను. అందుకే ఇంట్లోనే ఉండి యూ ట్యూబ్ వీడియోస్ చేశాను. ఆ సమయంలో వ్యక్తిగతంగా నాలో చాలా మార్పు చూశాను. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు ఓకే చేశాను. ఓ నటుడిగా ఏ ఎమోషన్ అయినా.. ఏ నేపథ్యం అయినా చేయగలగాలనేది నా అభిప్రాయం. దర్శకులు రాజ్‌కుమార్ హిరానీ, జోయా అఖ్తర్, రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్‌తో పనిచేయాలని ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments